క్రికెట్ అభిమానులలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఐపీఎల్ 2023 షెడ్యూల్ రానే వచ్చింది. ఈ టోర్నీ మార్చి 31న ప్రారంభం కానుండగా, మే 21న జరుగబోయే ఫైనల్ పోరుతో ముగియనుంది. అయితే, ఈసారి ఐపీఎల్ యాజమాన్యం కొత్త తరహాలో మ్యాచులు నిర్వహించబోతోంది. 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించి మ్యాచులు నిర్వహించనున్నారు.
క్రికెట్ అభిమానులకు అసలైన వినోదాన్ని అందించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. పది టీంలు పోరాడబోయే ఈ క్యాష్ రిచ్ లీగ్ మార్చి 31న ప్రారంభం కానుండగా, మే 21న జరుగబోయే ఫైనల్ పోరుతో ముగియనుంది. కరోనా దృష్ట్యా గతం కొన్ని సీజన్లలో వేదికలను కుదించిన్నప్పటికీ.. ఈసారి దేశవ్యాప్తంగా 12 స్టేడియాల్లో మ్యాచులు నిర్వహించనున్నారు. అహ్మదాబాద్, లక్నో, మొహాలీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, జైపూర్, ముంబై, గువహటి, ధర్మశాలలో మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రతి జట్టు సొంత మైదానంలో ఏడు మ్యాచులు, బయటి వేదికల్లో ఏడు మ్యాచులు ఆడనున్నాయి.
16వ సీజన్ లో మొత్తం 70 లీగ్ మ్యాచ్ లు జరగనుండగా, ఇందులో 18 డబుల్ హెడర్స్ ఉన్నాయి. డబుల్ హెడర్స్ (శని, ఆదివారాలలో) ఉన్న రోజుల్లో మ్యాచులు మధ్యాహ్నం 3.30 గంటలకు, రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. మిగిలిన రోజుల్లో రాత్రి 7.30 గంటలకు మొదలవుతాయి. అయితే, ఈసారి కొత్తగా 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించి మ్యాచులు నిర్వహించనున్నారు. ఇరు గ్రూపుల్లోని టాప్-2 ప్లేసుల్లో నిలిచిన జట్ల మధ్య నాకౌట్ మ్యాచులు జరగనున్నాయి.
గ్రూప్ ఏ: ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్.
గ్రూప్ బి: చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్.
ఈ టోర్నీలో ఎస్‌ఆర్‌హెచ్ మొత్తం 14 లీగ్ మ్యాచుల్లో తలపడనుంది. ఇందులో హైదరాబాద్ వేదికగా(రాజీవ్ గాంధీ స్టేడియం) 7 మ్యాచులు జరగనున్నాయి. ఏప్రిల్ 2న రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుండగా, ఏప్రిల్ 9న పంజాబ్ కింగ్స్, ఏప్రిల్ 18న ముంబై ఇండియన్స్, ఏప్రిల్ 24న ఢిల్లీ క్యాపిటల్స్, మే 04న కోల్ కతా నైట్ రైడర్స్, మే 13న లక్నో సూపర్ గెయింట్స్, మే 18న రాయల్ చాలెంజర్స్ బెంగుళూరుతో అమీ తుమీ తేల్చుకోనుంది. కాగా, గత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. పాండ్యా సారథ్యంలోని టైటాన్స్ జట్టు ఫైనల్ పోరులో 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించింది.
ఐపీఎల్ 2023 ఎస్‌ఆర్‌హెచ్ షెడ్యూల్..#IPL2023 #IPLSchedule pic.twitter.com/nRFzIWx4CE
— SumanTV (@SumanTvOfficial) February 17, 2023
ఐపీఎల్ 2023 షెడ్యూల్..#IPL2023 #IPLSchedule pic.twitter.com/L6T2eaoMiQ
— SumanTV (@SumanTvOfficial) February 17, 2023