ఐపీఎల్ 2022 సీజన్ వరుస ఐదు మ్యాచ్ ఓటమిలతో ప్లేఆఫ్స్ రేసులో వెనకబడిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ముంబయిపై ఊహిచని విజయంతో మళ్లీ రేసులోకి వచ్చింది. మంగళవారం వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ లో మూడు పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే కీలకమైన మ్యాచ్ కావడంతో సన్‌రైజర్స్ టీమ్ సమష్టిగా రాణించి విజయాన్ని అందుకుంది. అయితే ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా నిలుపుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఊహించని షాక్ తగిలింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్, జట్టును వదిలి స్వదేశాన్నికి వెళ్లాడు. వివరాల్లోకి వెళ్తే..
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సతీమణి సారా రహీం రెండో బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో కేన్ మామ, ఐపీఎల్ బయో బబుల్‌ని వీడి, న్యూజిలాండ్‌కి బయలుదేరి వెళ్లాడు. ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ అందుబాటులో ఉండడం లేదు. డిసెంబర్ 2020న కేన్ విలియమ్సన్, సారా రహీం దంపతులకు తొలి సంతానంగా ఓ అమ్మాయి జన్మించింది. ఆ సమయంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ నుంచి తప్పుకుని, ఇంటికి వెళ్లాడు కేన్ విలియమ్సన్. ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ చేరాలంటే పంజాబ్ కింగ్స్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌లో భారీ తేడాతో ఘన విజయాన్ని సాధించాల్సి ఉంది.
𝑶𝑭𝑭𝑰𝑪𝑰𝑨𝑳 𝑼𝑷𝑫𝑨𝑻𝑬:
Our skipper Kane Williamson is flying back to New Zealand, to usher in the latest addition to his family. 🧡
Here’s everyone at the #Riser camp wishing Kane Williamson and his wife a safe delivery and a lot of happiness!#OrangeArmy #ReadyToRise pic.twitter.com/3CFbvN60r4
— SunRisers Hyderabad (@SunRisers) May 18, 2022
అయినా కూడా మిగిలిన జట్ల ఫలితాలపై ఆధారపడి ప్లేఆఫ్స్ చేరే ఛాన్స్ నిర్ణయించబడుతుంది. కేన్ జట్టుకి దూరం కావడంతో ఆఖరి మ్యాచ్ కి ఎవరు కెప్టెన్ గా వ్యవహరిస్తారనేది తెలియాల్సి ఉంది. భువనేశ్వర్ కుమార్ కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం ఉంది. గత సీజన్ లోనూ గాయం కారణం కేన్.. ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడలేదు. ఆసమయంలో మనీశ్ పాండే కెప్టెన్ గా వ్యవహించాడు. మరి..కీలక సమయంలో సన్ రైజర్స్ కి తగిలిన ఈ ఊహిచిన షాక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: షోయబ్ అక్తర్ బౌలింగ్ పై సెహ్వాగ్ సంచలన కామెంట్స్!