ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న సైమన్ కటిచ్ తన పదవికి రాజీనామా చేశాడు. ఇప్పటికే జట్టు ఎంపిక సరిగా లేదని బాధపడుతున్న SRH ఫ్యాన్స్‌కు.. తాజాగా సీనియర్ కోచ్ కటిచ్ రాజీనామా చేయడంతో గత సీజన్‌లోలాగా ఈ సారి కూడా తమ జట్టు పాయింట్ల పట్టికలో లాస్ట్ ప్లేస్‌లో నిలుస్తుందేమోనని భయపడుతున్నారు. ఫ్యాన్స్ ఇలా కంగారు పడిపోవడానికి కారణాలు కూడా లేకపోలేదు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ అసిస్టెంట్ కోచ్ సైమన్ కటిచ్ నేడు తన పదవి నుంచి తప్పుకున్నాడు. తప్పుకునే క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్‌పై ఆయన పలు ఆరోపణలు చేశాడు. ఈ సారి మెగా వేలంలో కావ్య మారన్ సరైన జట్టును కొనుగోలు చేయలేదని బాంబు పేల్చాడు. ముందు అనుకున్న వ్యూహాలను వేలంలో అమలు చేయలేదని ఆరోపించాడు. దీంతో మెగా వేలంలో ఫేలవమైన జట్టును కొనుగోలు చేశారని మండిపడ్డాడు. ఈ కారణంగా తాను రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నాడు. మొత్తంగా పరిశీలిస్తే ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఆటగాళ్ల ఎంపిక, కొనుగోలు వంటి ప్రక్రియల విషయంలో సైమన్ కటిచ్, సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్‌కు మధ్య విబేధాలు వచ్చాయని అర్థం అవుతుంది.
అలాగే గతేడాది డేవిడ్ వార్నర్‌తో నెలకొన్న విభేదాల కారణంగా అతన్ని జట్టు నుంచి తొలగించిన తర్వాత రైజర్స్ ఆట తీరు మరింతగా దిగజారింది. ఇప్పుడు సైమన్ విషయంలో కూడా అలాంటి తప్పిందమే జరిగిందని SRH ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాగా కావ్య మారన్ అన్ని తానైన వ్యవహరిస్తూ.. ఒక పక్కా ప్లాన్ ప్రకారం జట్టును ఎంపిక చేస్తే.. ఇలా ఆరోపణలు చేస్తూ రాజీనామా చేయడం కావ్యను అవమానించడమే అవుతుందని సోషల్ మీడియాలో మరో వాదన కూడా వినిపిస్తుంది. మరి సైమన్ నిర్ణయం, SRH భవితవ్యంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
SRH జట్టు..
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, రొమారియో షెపర్డ్, సీన్ అబాట్, శశాంక్ సింగ్, సౌరభ్ దూబే, ప్రియం గార్గ్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, కార్తీక్ త్యాగి, శ్రేయాస్ గోపాల్, జగదీశ సుచిత్, ఐడెన్ మార్క్‌రామ్, ఫజల్హాక్ ఫరూకీ, టీ. నటరాజన్, భువనేశ్వర్ కుమార్, గ్లెన్ ఫిలిప్స్, విష్ణు వినోద్.