సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు రాహుల్ త్రిపాఠి దేశవాళీ క్రికెట్‌లో దుమ్మురేపుతున్నాడు. మహారాష్ట్రకు చెందిన ఈ రైట్ హ్యాండ్ టాపార్డర్ బ్యాటర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో ఎంతో కీలకమైన ప్లేయర్. గత సీజన్‌లో నిలకడగా రాణించి ఆకట్టుకున్నాడు. దీంతో ఐపీఎల్ 2023 కోసం కూడా రాహుల్ త్రిపాఠిని సన్‌రైజర్స్ హైదరబాద్ రిటేన్ చేసుకుంది. అయితే.. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో తన స్వరాష్ట్రం మహారాష్ట్రకు ఆడుతున్న రాహుల్.. వరుస సెంచరీలతో అదరగొడుతున్నాడు. తాజాగా మిజోరంతో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన త్రిపాఠి.. 99 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సులతో 107 పరుగులు చేసి రాణించాడు. రాహుల్ త్రిపాఠితో పాటు అంకిత్, అజిమ్ హాఫ్ సెంచరీలతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర 341 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన త్రిపాఠికి ఇది వరుసగా మూడో సెంచరీ కావడం విశేషం. అంతకుముందు ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 156 పరుగులు బాదిన త్రిపాఠి.. ఆ తర్వాత సర్విసెస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 111 పరుగులతో దుమ్మురేపాడు. ఇలా మూడు మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలతో మహారాష్ట్ర టీమ్‌కు వెన్నుముకలా మారాడు. ఇక ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టుకు ఆడి వెలుగులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి.. 2017లోనే ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. రైజింగ్ పూణె సూపర్‌జెయింట్స్ జట్టు తరఫున ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన త్రిపాఠి 12 మ్యాచ్‌ల్లో 391 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు.
ఆ తర్వాత త్రిపాఠిని రాజస్థాన్ రాయల్స్ 2018లో 3.4 కోట్లకు దక్కించుకుంది. 2018-19 సీజన్లలో రాజస్థాన్ తరఫున 20 మ్యాచ్‌ల్లో 367 పరుగులు చేశాడు. ఇక 2020-21 సీజన్లులో కేకేఆర్‌కు ఆడిన త్రిపాఠి కేవలం 60 లక్షలకే కోల్‌కత్తాకు చిక్కాడు. 2020లో 11 మ్యాచ్‌ల్లో 230, 2021 సీజన్‌లో 17 మ్యాచ్‌ల్లో 397 పరుగులతో అదరగొట్టాడు. దీంతో ఐపీఎల్ 2022లో భీకర ఫామ్‌లో కొనసాగిన త్రిపాఠి.. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 14 మ్యాచ్‌ల్లో ఏకంగా 413 పరుగులు సాధించాడు. అందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే.. ఐపీఎల్ 2022లో రాహుల్ త్రిపాఠికి ఎవరూ ఊహించని విధంగా ఏకంగా రూ.8.5 కోట్ల భారీ ధరపెట్టి సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. రానున్న ఐపీఎల్ 2023 సీజన్‌లో సైతం ఇదే ఫామ్‌ను కొనసాగించి.. సత్తా చాటాలని త్రిపాఠి భావిస్తున్నాడు.
Alexa, play “I’m unstoppable” 💯
Rahul Tripathi smashes his 3⃣rd consecutive ton in the #VijayHazareTrophy 🧡#MAHvMIZ #OrangeArmy pic.twitter.com/fiEmP7teiM
— SunRisers Hyderabad (@SunRisers) November 21, 2022
Rahul Tripathi in Vijay Hazare Trophy 2022 so far:
75(80).
2(14).
156*(127).
111(113).
107(99).He is amazing form currently!
— CricketMAN2 (@ImTanujSingh) November 21, 2022