ఒకప్పుడు టీమిండియాలో ఒక వెలుగు వెలిగిన వెటరన్ పేసర్ శ్రీశాంత్ తొమ్మిదేళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో బరిలోకి దిగాడు. కేరళ తరపున ఆడిన శ్రీశాంత్ మేఘాలయతో జరిగిన తొలి మ్యాచ్‌లో వికెట్ తీశాడు. ఇన్నింగ్స్ 40వ వేసిన శ్రీశాంత్ బౌలింగ్‌లో.. ఆర్యన్ బోరా వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో చాలాకాలం తర్వాత వికెట్ తీయడంతో శ్రీశాంత్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. పిచ్‌పై ఒక్క సారిగా సాష్టాంగ ప్రణామం చేశాడు. ఈ వీడియోను శ్రీశాంత్ ట్విటర్‌లో షేర్ చేశాడు. “తొమ్మిదేళ్ల తర్వాత నా తొలి వికెట్ సాధించాను. దేవుడు దయ వల్ల నేను ఇది సాధించగలిగాను” అని ట్విటర్‌లో శ్రీశాంత్ పేర్కొన్నాడు. కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో తన 12 ఓవర్ల స్పెల్‌లో 40 పరుగులు ఇచ్చి 2 వికెట్లు సాధించాడు. రెండవ ఇన్నింగ్స్‌లో వికెట్లు ఏమీ పడగొట్టలేదు.
కాగా 2013 ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన శ్రీశాంత్‌పై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. దీంతో బీసీసీఐ అతడిపై జీవిత కాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ శ్రీశాంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు స్పందిస్తూ.. శిక్ష కాలాన్ని తగ్గించమని బీసీసీఐను ఆదేశించింది. దీంతో బీసీసీఐ అతడిపై నిషేధాన్ని ఏడు ఏళ్లకు కుదించింది. దీంతో 13 సెప్టెంబర్ 2020 నుంచి అతడిపై నిషేధం ఎత్తివేయబడింది. అయితే ఐపీఎల్-2022 మెగా వేలంలో తన పేరును రిజిస్టర్ చేసుకున్న శ్రీశాంత్‌ను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగొలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. అయినా కూడా పట్టువదలకుండా శ్రీశాంత్ దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్నాడు. అక్కడ సత్తా చాటి జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలనే దృఢసంకల్పంతో ఉన్నాడు. మరి శ్రీశాంత్ రీఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Now that’s my 1st wicket after 9 long years..gods grace I was just over joyed and giving my Pranaam to the wicket ..❤️❤️❤️❤️❤️❤️❤️ #grateful #cricket #ketalacricket #bcci #india #Priceless pic.twitter.com/53JkZVUhoG
— Sreesanth (@sreesanth36) March 2, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.