టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక వెలుగు వెలిగిన తర్వాత.. ఫిక్సింగ్ ఆరోపణలతో నిషేధానికి గురైన శ్రీశాంత్.. బ్యాన్ ముగిసిన తర్వాత దేశవాళీలో కొన్ని మ్యాచ్‌లు ఆడి క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమైపోయాడు. అబుదాబి టీ10 లీగ్‌లో బంగ్లా టైగర్స్ జట్టుకు వచ్చే సీజన్‌లో మెంటర్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని బంగ్లా టైగర్స్ ఫ్రాంచైజ్ మేనేజ్‌మెంట్ స్వయంగా ప్రకటించింది. టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌తో కలిసి పని చేయడానికి చాలా ఉత్సహంగా ఉన్నట్లు, అతను మా టీమ్‌కు మెంటర్‌గా వస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు.
ఇక ఈ టీమ్‌కు ఐకాన్ ప్లేయర్ కమ్ కెప్టెన్‌గా బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం ఆ జట్టు హెడ్ కోచ్‌గా బంగ్లాదేశ్ మాజీ ఆల్‌రౌండర్ అఫ్తాబ్ అహ్మెద్, అసిస్టెంట్ కోచ్‌గా నజ్ముల్ అబెదిన్ ఉన్నారు. వీరితో కలిసి శ్రీశాంత్ బంగ్లా టైగర్స్‌కు మెంటర్‌గా వ్యవహరించనున్నాడు. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా మాజీ దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోని నిర్వర్తించిన రోల్‌ను శ్రీశాంత్ అబుదాబి టీ10 లీగ్‌లో బంగ్లా టైగర్స్ టీమ్‌లో పోషించనున్నాడు. ఇంతకు ముందు ఈ జట్టుకు సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇకపోతే 2005లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీశాంత్ అద్భుత బౌలింగ్‌తో అనతికాలంలోనే భారత జట్టులో కీ బౌలర్‌గా ఎదిగాడు. ఆ తర్వాత 2007లో మొట్టమొదటి టీ20 వరల్డ్‌ను సాధించిన భారత జట్టులో శ్రీశాంత్ సభ్యుడిగా ఉన్నాడు. ఫైనల్‌లో జోగిందర్‌శర్మ వేసిన చివరి ఓవర్‌లో మిస్బా ఉల్‌హక్ క్యాచ్ అందుకుంది శ్రీశాంతే. ఇక ఆ తర్వాత ఐపీఎల్‌లోనూ శ్రీశాంత్ అదరగొట్టాడు. పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు ఆడాడు. ఐపీఎల్‌లో టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్-శ్రీశాంత్ మధ్య గొడవ అప్పట్లో సంచలనంగా మారింది.
కాగా 2013 ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన శ్రీశాంత్‌పై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో బీసీసీఐ అతడిపై జీవిత కాల నిషేధం విధించింది. 2020లో నిషేధం ముగియడంతో దేశవాళీ క్రికెట్‌లోకి రీఎంట్రీ కూడా ఇచ్చాడు. ఆ తర్వాత 2022 మెగా వేలంలో పేరు నమోదు చేసుకున్నా అన్‌సోల్డ్ ప్లేయర్‌గా మిగిలిపోయాడు. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్‌లో కేరళ తరఫున మరికొన్ని మ్యాచ్‌లు ఆడి క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. శ్రీశాంత్ టీమిండియా తరఫున 27 టెస్టుల్లో 87 వికెట్లు, 53 వన్డేల్లో 75 వికెట్లు పడగొట్టాడు. అలాగే, 10 టీ20 మ్యాచుల్లో 7 వికెట్లు, ఐపీఎల్‌లో 40 మ్యాచుల్లో 44 వికెట్లు తీశాడు. మరి మెంటర్‌గా శ్రీశాంత్ సెకండ్ ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఆరోజు శ్రీశాంత్ ను కొట్టి చాలా పెద్ద తప్పు చేశాను: హర్భజన్ సింగ్
Looking forward pic.twitter.com/qgzPiyGmK0
— Sreesanth (@sreesanth36) August 25, 2022
Bangla Tigers are delighted to appoint @sreesanth36 as the brand ambassador for the 6th season of Abu Dhabi @T10League . 👨🏻💼☑️#BanglaTigers #LetsGoHunt #abudhabit10 pic.twitter.com/YdV2tXFT5t
— Bangla Tigers (@BanglaTigers_ae) August 25, 2022