ఇటివల ముగిసిన ఆసియా కప్‌లో ఘోరంగా విఫలమైన టీమిండియా ఆస్ట్రేలియాతో సిరీస్‌లో ఆకట్టుకుంది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. కాగా ఆసియా కప్‌లో టీమిండియా వైఫల్యానికి బౌలింగ్ ప్రధాన కారణమనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆస్ట్రేలియాపై సిరీస్ విజయం సాధించినా.. బౌలింగ్ విభాగం అంత పటిష్టంగా లేదనే విషయం స్పష్టమైంది. ఆసీస్‌తో భారత్ సిరీస్ నెగ్గిందంటూ అందుకు కారణం బ్యాటింగ్ బలంతోనే. ఒక్క అక్షర్ పటేల్ తప్పించి దాదాపు టీమిండియా బౌలింగ్ విభాగం మొత్తం విఫలమైందనే చెప్పాలి. అందులోనూ సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ దారుణంగా విలఫం అవుతున్నారు. డెత్ ఓవర్స్‌లో ధారళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. దీంతో భువీపై విమర్శల వర్షం కురుస్తుంది. పైగా అతను టీ20 వరల్డ్ కప్ జట్టులో కూడా ఉండటంతో విమర్శలు మరింత ఎక్కువ అవుతున్నాయి. ఈ బౌలింగ్‌తో వరల్డ్ కప్ కష్టమని క్రికెట్ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.
ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ మాత్రం భువీని వెనకేసుకొచ్చాడు. భువీని తక్కువగా అంచనా వేయవద్దని.. రాబోయే టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాకు అతనే కీ ప్లేయర్ అంటూ మద్దతు పలికాడు. శ్రీశాంత్ మాట్లాడుతూ..‘భువనేశ్వర్ ఈ మాటలు వింటుంటే.. అతనికి నాదో రిక్వెస్ట్. దయచేసి నీపై వస్తున్న విమర్శలను పట్టించుకోకు. నీ సామర్థ్యంపై నమ్మకం ఉంచు. ఎందరు విమర్శించినా.. కేవలం ఇప్పటి పరిస్థితులను ఆధారంగా చేసుకుని మాత్రమే మాట్లాడతారు. కానీ.. నీకు మాత్రమే తెలుసు ఈ స్థాయికి వచ్చేందుకు నువ్వు ఏం చేశావో.. నీలో ఎంత టాలెంట్ ఉంటే ఇంత వరకు వచ్చావో నీకే తెలుసు. నిన్ను నువ్వు నమ్ము. నువ్వు ఏం చేయగలవో నీకు తెలుసు దాన్ని నువ్వు నమ్మాలి. నీపై వచ్చే విమర్శలను పట్టించుకోకు’ అని శ్రీశాంత్ అన్నాడు.
భువనేశ్వర్ కుమార్ దేశవాళీ క్రికెట్ ఆడుతున్న సమయంలో కూడా నేను అతన్ని గమనించాను. చాలా కష్టపడతాడు. విజయ్ హజారే ట్రోఫీ సందర్భంగా భువీ జిమ్ చేస్తూ.. సిమ్మింగ్ చేస్తూ.. ఫిట్‌నెస్ పూర్తి మంచి శ్రద్ధ పెట్టేవాడని, అతని వర్క్ ఎతిక్స్ అద్భుతమని శ్రీశాంత్ కొనియాడాడు. ఇప్పటికే అతను అలాగే కష్టపడుతుంటాడు. కానీ.. అందరు అతను వేసే 19వ ఓవర్ గురించే మాట్లాడుతున్నారు. కానీ.. ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. టీ20 వరల్డ్ కప్ 2022లో భువీ అద్భుతం చేస్తాడు అని శ్రీశాంత ధీమా వ్యక్తం చేశాడు. కాగా.. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లోనూ భువీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. దీంతో సౌతాఫ్రికా టీ20 సిరీస్‌కు భువీకి విశ్రాంతి ఇచ్చారు. మరి టీ20 వరల్డ్ కప్‌లో భువీ ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి.
“Every cricketer has lows and highs in their career. Let’s support and don’t put too much pressure on him (Bhuvi). He is not going anywhere and will prove himself again,” @sreesanth36 said. #INDvAUShttps://t.co/zzkS2DFYXc
— Circle of Cricket (@circleofcricket) September 24, 2022
As Bhuvneshwar Kumar struggles, S Sreesanth offers important piece of advice https://t.co/6qIX6ig8gn
— Times Now Sports (@timesnowsports) September 27, 2022
ఇది కూడా చదవండి: మన్కడింగ్ వివాదానికి పుల్‌స్టాప్! నిజం ఒప్పుకున్న ఇంగ్లండ్ బ్యాటర్