ది పేస్ కింగ్ ‘ఉమ్రాన్ మాలిక్‘. ఏడాది క్రితం వరకు ఈ పేరు ప్రపంచానికి తెలియదు. ఒక నెట్ బౌలర్ గా ఎస్ఆర్‌హెచ్ టీంలోకి ఎంట్రీ ఇచ్చిన ఉమ్రాన్.. నేడు భారత జట్టులో కీలక బౌలర్ గా మారాడు. గంటకు 150కిలోమీటర్ల వేగంతో బంతులేస్తూ.. బ్యాటర్లకు దడపుట్టిస్తున్నాడు. ఇది ఉమ్రాన్ లో ఒక యాంగిల్ మాత్రమే. అతనిలో మరో యాంగిల్ కూడా ఉంది. ఉమ్రాన్ బ్యాటింగ్ లోనూ రాణించగలడు. ఏదో.. సాదా.. సీదా పరుగులు అనుకోకండి.. మెరుపులు.. మెరిపించగలడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరాలవుతోంది.
ఐపీఎల్ 2021 సీజన్.. అక్టోబర్ 6వ తేదీ. అబుదాబి వేదికగా ఎస్ఆర్‌హెచ్, ఆర్‌సీబీ జట్ల మధ్య మ్యాచ్. ఈ మ్యాచులో అప్పుడప్పుడే సన్ రైజర్స్ జట్టులోకి వచ్చిన ఓ 21 ఏళ్ల కుర్రాడు బౌలింగ్ చేసేందుకు వచ్చాడు. మొదటి బాల్ గంటకి 147 కిలోమీటర్ల వేగంతో సంధించాడు. రెండో బాల్ 150 కిలోమీటర్ల వేగంతో.. మూడో బాల్ 152 కిలోమీటర్ల వేగంతో.. ఇవన్నీ జస్ట్ శాంపిల్ మాత్రమే. ఎందుకంటే అదే ఓవర్ నాలుగో బంతి ఏకంగా 153 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చింది. అంతే.. అందరూ వావ్ అన్నారు.ఈ ఒక్క ఓవర్ తో ఉమ్రాన్.. ఐపీఎల్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ బాల్ వేసిన తొలి ఇండియన్ బౌలర్ గా రికార్డ్ క్రియేట్ చేసాడు. అంతేకాదు.. ఆ ఓవర్ లో మిగతా బాల్స్ ను కూడా 150+ వేగంతో సంధించి.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగమైన ఓవర్ వేసిన బౌలర్ గా ఒక అరుదైన ఘనత సాధించాడు.
Excellent Debut from Umran Malik!
Very Young Cricketer from J&K made a bang in the IPL with the ball speed exceeding 150 KPH mark in his first Match@diprjk @ddnewsSrinagar
Just 21 year old !!
#IPL2021 pic.twitter.com/xVkVIAoNhN— Srinagar district administration (@srinagaradmin) October 4, 2021
అలా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఉమ్రాన్.. ఐపీఎల్ 2022 లో సైతం ఇరగదీశాడు. ఈ సీజన్ లో సన్ రైజర్స్.. ఆ మాత్రం విజయాలు అయినా సాధించింది అంటే.. అది ఉమ్రాన్ వల్లే. ఎప్పుడు వికెట్ కావాలన్నా అది ఉమ్రాన్ వల్లే సాధ్యమైంది. దీంతో జాతీయ జట్టుకు ఆడే అవకాశం దక్కింది. ఇదంతా ఉమ్రాన్ లో ఒక వైపు మాత్రమే. అతనిలో మరో యాంగిల్ కూడా ఉంది. ఉమ్రాన్.. బ్యాటింగ్ లో కూడా రాణించగలడు. ఫ్రంట్ ఫుట్.. కవర్ డ్రైవ్.. స్క్వేర్ లెగ్.. ఫుల్ షాట్.. ఇలా అన్ని రకాల షాట్లు ఆడగలడు. ఉమ్రాన్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
From being a tennis ball player till he was in his late teens to becoming the one of the fastest bowler in the world🔥🔥🔥🔥#UmranMalik..#INDvsNZ #NZvsINDpic.twitter.com/2rpwp16nSD
— Cric18👑 (@Criclav_18) November 25, 2022
ఈ వీడియోలో ఉమ్రాన్.. బ్యాటర్ గా చూడ ముచ్చటైన షాట్లు ఆడుతున్నాడు. అందులోనూ.. పర్ఫెక్ట్ గా మిడిల్ చేస్తున్నాడు. ఫ్రంట్ ఫుట్.. బ్యాక్ ఫుట్.. ఇలా అన్ని రకాల షాట్లు ఆడుతున్నాడు. అతడు ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే.. భారత జట్టుకు ఉన్న ఆల్ రౌండర్ లోటు తీరినట్లే అవుతుంది. అయితే ఉమ్రాన్.. ప్రస్తుతానికి బౌలింగ్ లో మెళుకువలు నేర్చుకోవాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పేస్ ఒక్కటే సరిపోదు.. లైన్ అండ్ లెంగ్త్ ఉంటాలంటూ.. మాజీలు సూచిస్తున్నారు. కావున ఉమ్రాన్ బౌలింగ్ పై శ్రద్ధ పెడితే ఇంకా బాగుంటుంది. ఉమ్రాన్ బ్యాటింగ్ పై.. మీరు ఓ లుక్కేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.