ఇటీవల సినీ, రాజకీయ, క్రీడా రంగాల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. దక్షిణాఫ్రికా బాక్సింగ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. దక్షిణాఫ్రికా కు చెందిన బాక్సర్ సిమిసో బుతలేజీ కన్నుమూశాడు. బుధవారం ఈ విషయాన్ని ఆ దేశ బాక్సింగ్ సమాఖ్య మీడియాకు తెలియజేసింది. రింగ్ లో ప్రత్యర్థితో వీరోచితంగా పోరాడిన బుతలెజి చాలా విచిత్ర పరిణామాల మద్య కన్నుమూశాడు. ప్రత్యర్థి చేసిన దాడిలో ఆయన రింగ్ లో కొద్ది సేపు మతి భ్రమించి ఏం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితిలో అతడు కుప్పకూలాడు. పరిస్థితి గమనించి వెంటనే ఆయనను దదగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కోమాలోకి వెళ్లిన సిమిసో బుతలేజీ మెదడులో అంతర్గత రక్తస్రావం కారణంగా మరణించాడు. వివరాల్లోకి వెళితే..
ఆదివారం దక్షిణాఫ్రికా బాక్సర్ సిమిసో బుతలెజి తన ప్రత్యర్థి సిఫెసిలె మంతుగ్వాతో రింగ్ లో తలపడటానికి సిద్దమయ్యాడు. అప్పటి వరకు ఇద్దరూ ఢీ అంటే ఢీ అన్నట్లు పోరాటం చేశారు. కొద్ది సేపటి తర్వాత రిఫరీ ఇరువురిని ఆపి రెస్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన ఇద్దరు ఆటగాళ్లు మళ్లీ తలపడ్డారు.
ఈ క్రమంలో సిమిసో బుతలెజి విచత్రంగా ప్రవర్తించాడు. తన ప్రత్యర్థి వైపు పంచ్ లు ఇవ్వకుండా గాల్లోకి విసురుతూ అటూ ఇటూ తిరిగి కిందపడిపోయాడు. వెంటనే ఆయనను హాస్పిటల్ కి తరలించగా మెదడు లో గాయం కావడం వల్ల చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.