సౌతాఫ్రికాతో స్వదేశంలో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. తొలి రెండు మ్యాచ్‌లో విజయం సాధించడంతో కొంతమంది స్టార్ ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చి, భారీ మార్పులతో మూడో మ్యాచ్‌లో బరిలోకి దిగిన టీమిండియా దారుణ ఓటమి చవిచూసింది. దీంతో సౌతాఫ్రికాను క్లీన్‌స్వీప్ చేయలేకపోయింది. టీ20 వరల్డ్ కప్‌కు ముందు టీమిండియా ఈ సిరీస్ విజయం సాధించినా.. ఈ సిరీస్‌తో ఎక్కువ లాభపడింది మాత్రం సౌతాఫ్రికానే. ఈ సిరీస్ కంటే ముందు టీమిండియా నుంచి ఎలాంటి ప్రదర్శన అయితే ఆశించారో దాదాపు అలాంటి ప్రదర్శనే ఇచ్చింది. టాపార్డర్ రాణించినా.. యాథావిధిగా బౌలింగ్ విభాగం దారుణంగా విఫలమైంది.
కానీ.. సౌతాఫ్రికా విషయంలో అలా జరగలేదు. ఈ సిరీస్ వారికి ఎంతో మేలు చేసింది. ఈ సిరీస్‌కు ముందు ఫామ్‌లోలేని ప్రధాన ఆటగాళ్లు మన బౌలర్ల పుణ్యామా అని ఫామ్‌ను అందుకున్నారు. టీ20 వరల్డ్ కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీకి ముందు ఆ జట్టు ఆటగాళ్లు క్వింటన్ డికాక్, రిలీ రోసోవ్, డేవిడ్ మిల్లర్ లాంటి వాళ్లంతా ఫామ్‌లోకి రావడం సౌతాఫ్రికాకు సానుకూలం అంశం. వీరంతా టీమిండియా బౌలర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఏ మాత్రం ఇబ్బంది పెట్టని బౌలింగ్‌తో స్వేచ్ఛగా పరుగులు చేసుకునే అవకాశం కల్పించారు.
తొలి మ్యాచ్‌లో డికాక్ ఒక రన్‌కే అవుట్ కాగా.. రిలీ రోసోవ్, మిల్లర్ డకౌట్లు అయ్యారు. ఆ మ్యాచ్‌లో పిచ్ సహకారంతో 9 పరుగులకే 5 వికెట్లు కూల్చిన భారత బౌలర్లు.. సౌతాఫ్రికాను మాత్రం ఆలౌట్ చేయలేకపోయారు. ఎందుకంటే పవర్‌ప్లే తర్వాత పిచ్ సహకరించలేదు. ఒక రెండో మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ చెలరేగి 237 పరుగులు చేస్తే.. సౌతాఫ్రికా కూడా 221 పరుగులు చేసి కేవలం 16 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఈ మ్యాచ్‌లో క్వింటన్ డికాక్ హాఫ్ సెంచరీతో ఫామ్ అందుకోగా.. డేవిడ్ మిల్లర్ వీరవిహారం చేసి సెంచరీతో అదరగొట్టాడు. మ్యాచ్ ఇండియా గెలిచినా.. ప్రశంసలు మిల్లర్‌కే దక్కాయి.
ఇక మూడో మ్యాచ్‌లో మూడు వరుస డకౌట్లు ఉన్న రిలీ రోసోవ్ సెంచరీతో భారత బౌలర్ల భరతం పట్టాడు. అతనికి తోడు రెండో మ్యాచ్‌తో ఫామ్ అందుకున్న డికాక్ హాఫ్ సెంచరీ, మిల్లర్ చివరి ఓవర్‌లో మూడు సిక్సులతో రెచ్చిపోయారు. ఇలా సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్లను ఫామ్‌లోకి రప్పించి.. టీ20 వరల్డ్ కప్ ముందు ఆ జట్టుకు ఎంతో మేలు చేశారు మన బౌలర్లు. అందుకే ఈ మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 2-1తో గెలుచుకున్నా.. ఎక్కువగా లాభపడింది మాత్రం సౌతాఫ్రికానే. ఇక ఈ సిరీస్‌లో బౌలింగ్ చేసిన అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, అక్షర్ పటేల్, అశ్విన్ టీ20 వరల్డ్ కప్ జట్టులో ఉన్న ఆటగాళ్లే. బుమ్రా గాయంతో దూరమయ్యాడు. భువనేశ్వర్ కుమార్‌పై పెద్దగా ఆశలు పెట్టుకోవడం కూడా అత్యాశే అవుతుంది. ఇలాంటి బౌలింగ్ ఎటాక్‌తో టీమిండియా వరల్డ్ కప్‌లో రాణించడం కష్టమే అని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
David Miller plays one of the best T20I knocks you’ll see in a losing cause 👏#INDvSA
— ESPNcricinfo (@ESPNcricinfo) October 2, 2022
Fantastic 💯 for Rilee Rossow 👏#INDvSA pic.twitter.com/UBIkJbAMog
— Saad Sultan Khan (@KhanSaad07) October 4, 2022
ఇది కూడా చదవండి: రోహిత్ పేరిట అత్యంత చెత్త రికార్డు! ప్రపంచంలోనే తొలి ప్లేయర్