సౌత్ ఆఫ్రికా టూర్ ఆఫ్ ఇండియా-2022లో భాగంగా దక్షిణాఫ్రికాతో టీమిండియా 5 టీ20ల్లో తలపడనుంది. ఢిల్లీ వేదికగా జూన్ 9న తొలి టీ20 జరగనుంది. ఈ 5 టీ20ల సిరీస్ పై క్రికెట్ ఫ్యాన్స్ లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇరు జట్లలో ఐపీఎల్ 2022 సీజన్లో రాణించిన ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. టీమిండియా స్క్వాడ్ లో ఈ సిరీస్ లో కనీసం ఇద్దరు యువ ఆటగాళ్లు అరంగేట్రం చేసే అవకాశం లేకపోలేదు. సౌత్ ఆఫ్రికా స్క్వాడ్ ని పరిశీలిస్తే.. మార్కరమ్, డేవిడ్ మిల్లర్, జన్ సన్, ప్రెటోరియస్, డికాక్, రబాడా ఇలా సఫారీ స్క్వాడ్ మొత్తం ఫుల్ ఫామ్ లో ఉన్న ప్లేయర్లు ఉన్నారు.
టీమిండియా విషయానికే వస్తే.. కేఎల్ రాహుల్, గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, దినేష్ కార్తీక్, పంత్, చాహల్, కుల్దీప్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్ వంటి సీనియర్లు, యంగ్ ప్లేయర్లతో సమతూకంగా ఉంది. ఈ స్క్వాడ్ ని చూసి టీమిండియా అభిమానులు సంబరపడిపోతుంటే.. అటు సఫారీలు మాత్రం కంగారు పడుతున్నారు. ఆ విషయాన్ని స్వయంగా ఆ జట్టు కెప్టెన్ బవుమా వెల్లడించాడు.
Mark it off on your calendars 🗓️
The #INDvSA T20I series in on our doorstep 🏏#INDvSA #BePartOfIt pic.twitter.com/oYvfxZLBgl
— Cricket South Africa (@OfficialCSA) June 7, 2022
టీమిండియా అంతా ఒకెత్తు అయితే ఆ ఇద్దరు స్పిన్నర్లని చూస్తే మా జట్టు మొత్తం కంగారు పడుతోందని బవుమా అంటున్నాడు. ‘టీమిండియాలోని యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ స్పిన్ ద్వయాన్ని చూసి మా జట్టు మొత్తం కలవర పడుతోంది. ఏ మీటింగ్ అయినా, సాధారణంగా మాట్లాడుకుంటున్నా కూడా అంతా వాళ్లిద్దరి గురించే ప్రస్తావిస్తున్నారు. నాకు తెలిసి మా వాళ్ల కలలో కూడా వాళ్లే వస్తున్నారు అనుకుంటా’ అంటూ బవుమా చెప్పుకొచ్చాడు.
Snapshots from #TeamIndia‘s training session ahead of the 1st T20I against South Africa.#INDvSA @Paytm pic.twitter.com/wA8O1Xr0i7
— BCCI (@BCCI) June 8, 2022
నిజానికి సౌత్ఆఫ్రికా జట్టు చాహల్, కుల్దీప్ విషయంలో ఆ రేంజ్ లో భయపడటం తప్పేం కాదులెండి. ఐపీఎల్ 2022 సీజన్లో యుజ్వేంద్ర చాహల్ అత్యధికంగా 27 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ సాధించాడు. అంతేకాకుండా ఈ సీజన్లో హ్యాట్రిక్ కూడా నమోదు చేశాడు. నాలుగు వికెట్లు ఒకసారి, ఐదు వికెట్లు ఓకసారి పడగొట్టాడు. అటు కుల్దీప్ యాదవ్ కూడా తక్కువేం కాదు.. ఈ సీజన్లో మొత్తం 21 వికెట్లు తీశాడు. అంతేకాదు ఈ సీజన్లో రెండుసార్లు 4 వికెట్లు పడగొట్టాడు. బవుమా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
💬 💬 “A dream come true moment to get India call up.”
Umran Malik speaks about the excitement on being a part of the #TeamIndia squad, Day 1 at the practice session, his idols and goals ahead. 👍 👍 – By @28anand
Full interview 🎥 🔽 #INDvSA | @Paytm pic.twitter.com/V9ySL4JKDl
— BCCI (@BCCI) June 8, 2022