అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్ కు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. బ్యాటర్లు, బౌలర్లు, హిట్టర్లు, ఆల్‌రౌండర్లతో కూడిన సమతూకమైన 15 మందిని ఎంపిక చేసింది. టెంబా బావుమా జట్టును నడిపించనుండగా.. గాయంతో కీలక ఆటగాడు వాండర్ డుసెన్ దూరమయ్యాడు. అతని స్థానంలో ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహించిన ట్రిస్టన్ స్టబ్స్ ను ఎంపిక చేశారు.
బ్యాటింగ్ లో క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్ కీలకం కానుండగా, బౌలింగ్ విభాగంలో కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, లుంగిడి ఎంగిడి, కేశవ్ మహరాజ్, తబ్రెయిజ్ షంసీ కీలకం కానున్నారు. ఇక.. ఆల్ రౌండర్లుగా డ్వేన్ ప్రిటోరియస్, వేన్ పార్నెల్ ఎంపికయ్యారు. కాగా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తర్వాత టీ20 ప్రపంచకప్ కు జట్టును ప్రకటించిన మూడో జట్టుగా ప్రొటిస్ నిలిచింది.
ఇక, టీ20 వరల్డ్ కప్ కు ముందే దక్షిణాఫ్రికా జట్టు 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ కోసం ఇండియాలో పర్యటించాల్సి ఉంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 11 మధ్య జరగనుంది.
ఇండియా vs దక్షిణాఫ్రికా (టీ20& వన్డే సిరీస్ షెడ్యూల్)
టీ20 మ్యాచులన్ని భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుండగా, వన్డే మ్యాచులు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానున్నాయి.
టీ20 ప్రపంచకప్‌కు దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్(కీపర్), హెన్రిచ్ క్లాసెన్(కీపర్), రీజా హెండ్రిక్స్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగిడి ఎంగిడి, అన్రిచ్ నోర్ట్జే, వేన్ పార్నెల్, డ్వేన్ ప్రిటోరియస్, కగిసో రబడ, రిలీ రొస్సో, తబ్రియాజ్ షంషీ, ట్రిస్టన్ స్టబ్స్.
రిజర్వ్ ఆటగాళ్లు: బోర్న్ ఫార్టుయిన్, మార్కో జాన్సెన్, ఆండిలే ఫెహ్లుక్వాయో.
South Africa announced their 15-member squad for the upcoming T20 World Cup 2022
Rassie van der Dussen❌
Tristan Stubbs✅#SouthAfrica #T20WorldCup #Cricket #CricTracker #T20 pic.twitter.com/fjVp3XPkuf— CricTracker (@Cricketracker) September 6, 2022