సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్.. వీరిద్దరూ ఇండియన్ క్రికెట్ కి చేసిన సేవలను మాటల్లో చెప్పలేము. గంగూలీ కెప్టెన్ గా టీమ్ ని అద్భుతంగా బిల్డ్ చేస్తే.., ఆ జట్టు కష్టాల్లో పడ్డ ప్రతిసారి ఒక రక్షకుడిగా కాపలా కాస్తూ వచ్చింది ద్రావిడే. చాలా కాలం పాటు గంగూలీ కెప్టెన్ గా, ద్రావిడ్ వైస్ కెప్టెన్ గా ఉంటూ.. ఇండియన్ క్రికెట్ టీమ్ ని దుర్బేధ్యంగా తయారు చేశారు.
రిటైర్డ్ అయ్యాక కూడా ఈ ప్రాణ స్నేహితులు క్రికెట్ ని వదలలేదు. ద్రావిడ్ జాతీయ క్రికెట్ అకాడమీకి డైరెక్ట్ గా బాధ్యతలు చేపట్టి, అద్భుతమైన యువ ఆటగాళ్ళని తాయారు చేశాడు. ఇదే సమయంలో గంగూలీ బీసీసీఐ అద్యక్షుడై ఇండియా.. ప్రపంచ క్రికెట్ ని శాశించే స్థితికి తీసుకొచ్చాడు. కానీ.., ఇన్నేళ్ల ప్రయాణంలో ఎన్నడూ వీరిద్దరి మధ్య విబేధాలు, వాదనలు వచ్చింది లేదు. కానీ.., ఇప్పుడు మొదటిసారి రాహుల్ ద్రావిడ్ పై గంగూలీ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఇందుకు కారణం ఇండియన్ క్రికెట్ టీమ్ కోచ్ స్థానం.
ప్రస్తుతం రవిశాస్త్రి ఇండియన్ క్రికెట్ టీమ్ కి హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. రానున్న టీ20 ప్రపంచకప్ తో శాస్త్రి కాంట్రాక్ట్ ముగుస్తుంది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తులు స్వీకరించనున్నారు. దీనికి అప్లై చేయమని, మిగిలిన కార్యక్యమం అంతా నేను చూసుకుంటానని ద్రావిడ్ కి తెలియచేశాడట గంగూలీ. కానీ.., ఇక్కడ ద్రావిడ్ కోరిక మరో రకంగా ఉంది. జాతీయ క్రికెట్ అకాడమీకి డైరెక్ట్ గా ద్రావిడ్ పదవి ఇంకో 10 రోజుల్లో ముగిసిపోనుంది. రానున్న రెండేళ్ల కోసం ఈ పదవికి మళ్ళీ కొత్తగా దరఖాస్తులు స్వీకరించనుంది బీసీసీఐ. ద్రావిడ్ తనని హెడ్ కోచ్ గా కాకుండా, జాతీయ క్రికెట్ అకాడమీకి డైరెక్ట్ గా కొనసాగించమని గంగూలీని కోరుతున్నాడట.
నేను టీమ్ ఇండియా ప్రధాన జట్టుకి హెడ్ కోచ్ గా రమ్మంటే, నువ్వు జాతీయ అకాడమీలోనే ఉండిపోతాను అంటావు ఎందుకని ద్రావిడ్ పై గంగూలీ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఇక్కడ గంగూలీ.. ద్రావిడ్ పై ఒత్తిడి చేయడానికి మరో బలమైన కారణం ఉంది. విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి కాంబినేషన్ లో ఇండియాకి ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా రాలేదు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ని శాసించే స్థితిలో ఉన్న ఇండియాకి ఇది కాస్త ఇబ్బంది కలిగించే అంశమే. ఈ లెక్కను మార్చడానికి ద్రావిడ్ అయితేనే సమర్ధుడని గంగూలీ నమ్మకం. అందుకే ద్రావిడ్ ని టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా చేయాలనుకుంటున్నాడు గంగూలీ. కానీ.., ద్రావిడ్ మాత్రం యువ కెరటాలకి మెరుగులు దిద్దే జాతీయ అకాడమీకే పరిమితం అవ్వాలని చూస్తున్నాడు. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున చర్చ నడిచినట్టు తెలుస్తోంది. తాజాగా సచిన్ టెండూల్కర్ కూడా ఈ విషయంలో ద్రావిడ్ మనసు మార్చడానికి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. మరి.. ద్రావిడ్, గుంగూలీ నిర్ణయాలలో ఏది కరెక్ట్? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.