కరోనా మహమ్మారి మరోసారి తన ప్రతాపం చూపిస్తోంది. దానికి తోడు కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కూడా తోడవ్వడంతో వ్యాప్తి తీవ్రమవుతోంది. కరోనా ప్రభావం ప్రస్తుతం క్రికెట్‌పై కూడా పడుతుంది. ఇప్పటికే రంజీ ట్రోఫీలో పాల్గొనే బెంగాల్ జట్టులో ఏడుగురు క్రికెటర్లకు కరోనా సోకింది. దీంతో ఇతర జట్టు ఆటగాళ్లు కూడా ఆందోళన చెందుతున్నారు. ఒక దశలో రంజీ ట్రోఫీ జరుగుతుందా? లేదా? అనే అనుమానాలు కూడా కలిగాయి.
ఈ దశలో కరోనా సోకి చికిత్స పొందుతున్న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రంగంలోకి దిగాడు. తన ఆరోగ్యం సహకరించకపోయినా.. ఇండియన్ క్రికెట్‌పై తనకున్న ప్రేమ, బీసీసీఐ అధ్యక్షుడిగా తన బాధ్యతను నిలబెట్టుకుంటూ.. రంజీ ట్రోఫీ నిర్వహణకు ప్రణాళిక రచించాడు. గతంలో కూడా చూసుకుంటే.. కరోనా తీవ్రంగా ఉన్న దశలో కూడా ఐపీఎల్ 2021 సీజన్‌ను నిర్వహించి గ్రేట్ అనిపించుకున్నాడు. ఇప్పుడు దేశవాళీ క్రికెట్‌కు ఆపద వచ్చినప్పుడు కూడా డెల్టా వేరియంట్ సోకి చికిత్స తీసుకుంటున్నా, తన అనారోగ్యాని సైతం లెక్క చేయకుండా.. రంజీ ట్రోఫీ నిర్వహణకు కావాల్సిన చర్యలు తీసుకుంటున్నాడు. ప్రతి విషయాన్ని తానే స్వయంగా పరిశీలిస్తూ.. ఇప్పటికే విజయవంతం అయినా బయోబబుల్ సిస్టమ్‌ను రంజీలోనూ ప్రవేశపెడుతున్నాడు.
అలాగే టోర్నమెంట్ సాగే రోజుల్లో ప్రతి రోజు ఆటగాళ్లు, వారి సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టనున్నారు. దీంతో రంజీ ట్రోఫీ నిర్వహణపై క్రికెటర్లకు గంగూలీ శుభవార్త అందించాడు. గంగూలీ తల్చుకుంటే ఏదైనా సాధ్యమే అని మరోసారి నిరూపించాడు. కరోనా ఇంతలా ఉన్నా కూడా దాదా రూలింగ్‌లో టీమిండియా సిరీస్ ఒక్కటి కూడా రద్దు కాలేదంటే.. దాదా ప్లానింగ్ ఎంత పకడ్‌బంధీగా ఉంటుందో అర్థం అవుతుంది. మరి దాదా కరోనాను సైతం లెక్క చేయకుండా ఇలా ఇండియన్ క్రికెట్‌కు సేవలందించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కెప్టెన్లుగా గంగూలీ, ధోని గొప్పతనాన్ని చెప్పిన హర్బజన్ సింగ్