భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ).. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డు. దీని ఆదాయం ముందు ఐసీసీ ఆదాయం కూడా వెలవెలబోతుంది. ఏటా వేల కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిస్తున్న బీసీసీఐకి ..ఒక్క ఐపీఎల్ ద్వారానే ప్రతి ఏడాది రూ.2 వేల నుంచి రూ.4 వేల కోట్లు ఆదాయం సమకూరుతోంది. ఏ లెక్కలన్నింటిపై టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఓపెన్ కామెంట్స్ చేశారు. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ కన్నా ఐపీఎల్ కే ఎక్కువ ఆదాయం వస్తోందని గంగూలీ చెప్పుకొచ్చాడు.
తాజాగా ఇండియా లీడర్షిప్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న గంగూలీ ఐపీఎల్ టోర్నీ గురించి, టీంఇండియాలో తన కెప్టెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎంతగానో ఇష్టపడే క్రికెట్ గేమ్ చాలా అభివృద్ధి చెందిందన్నారు. “క్రికెట్ ఎంతలా అభివృద్ధి చెందిందో నేను కళ్లారా చూశాను. నాలాంటి క్రికెటర్లు ఇక్కడ వందల్లో సంపాదిస్తే.. ఇప్పటి ఆటగాళ్లు కోట్లు సంపాదిస్తున్నారు. ఐపీఎల్ టోర్నీ క్రికెట్ అభిమానులు నుంచి పుట్టిందే. వాళ్లే ఈ టోర్నీని నడిపిస్తున్నారు. రాబోవు కాలంలో ఇది మరింత అభివృద్ధి చెందుతుంది. ఆదాయం పరంగా చూస్తే.. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ కన్నా ఎక్కువ ఆదాయం వస్తోంది. నేను ఎంతగానో ఇష్టపడే ఆట ఈ స్థాయికి చేరడం చాలా సంతోషంగా ఉంది’ అని గంగూలీ చెప్పుకొచ్చారు.
“The IPL generates more revenue than the English premier league. It makes me feel happy and proud that the sport I love has evolved to become so strong. The game is run by the fans.” – BCCI President Sourav Ganguly
— CricketMAN2 (@ImTanujSingh) June 12, 2022
ఇది కూడా చదవండి: IND vs SA 1st T20: వీడియో: ఢిల్లీ మ్యాచులో ప్రేక్షకుల కొట్లాట.. ఆలస్యంగా వెలుగులోకి..
ఈ క్రమంలో టీమిండియాలో తన కెప్టెన్సీ ఎలా ఉండేదని అడిగిన ప్రశ్నకు.. “నా అభిప్రాయం ప్రకారం.. కెప్టెన్సీ అనేది మైదానంలో జట్టును ముందుండి నడిపించడం. లీడర్షిప్ అనేది జట్టును బలంగా తీర్చిదిద్దడం. అలాంటప్పుడు నేను.. అజహరుద్దీన్ తో పనిచేసినా.. సచిన్, ద్రవిడ్ తో పనిచేసినా వారితో ఏనాడూ పోటీపడలేదు. వాళ్లతో కలిసిపోయి బాధ్యతలను పంచుకున్నా’ అని వివరించారు. ఈ క్రమంలో.. భారత్ లో నైపుణ్యానికి కొదవలేదని.. యువ క్రికెటర్ల మొదలు యువ వ్యాపారవేత్తలు, ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరూ అద్భుతంగా రాణిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
IPL is bigger than the English Premier League :
BCCI President Sourav Ganguly says that IPL generates more revenue than football’s English Premier League and feels happy after seeing the game he loves evolving so much#HiruEnglishNews #TruthAtAllCosts #Hirunews #IPL #HiruSPORTS pic.twitter.com/Oi4EcD8kOI— Hiru News English (@HiruNewsEnglish) June 12, 2022