భారత క్రికెట్ ప్రధాన కొచ్ గా రాహుల్ ద్రవిడ్ ను నియమిస్తూ సులక్షణ నాయక్, ఆర్పీ సింగ్ నేతృత్వంలోని క్రికెట్ సలహాదారుల కమిటీ(సీఏసీ) ద్రవిడ్‌ను ఏకగీవ్రంగా నియమిస్తున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ప్రధాన కోచ్ గా ఉన్న రవిశాస్త్రి స్థానంలో రాహుల్ ద్రవిడ్ రానున్నారు. అయితే కోచ్ గా ద్రవిడ్ నియామకంపై అసలు విషయాలు బయటపెట్టాడు సౌరవ్ గంగూలీ.
అయితే టైమ్స్ నౌ న్యూస్ తెలిపిన సమచారం మేరకు.. ద్రవిడ్ ఎంపిక కాకముందు ఆయన కొడుకు నాకు ఫోన్ చేసి.. మా నాన్న నా పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాని ఆయనను తీసుకెళ్లండి అంటూ చెప్పాడు. దీని కారణంగానే ద్రవిడ్ ను టీమిండియా ప్రధాన కోచ్ గా ఎంపిక చేశామంటూ గంగూలీ కొన్ని ఫన్నీ కామెంట్స్ చేశారు. ఇక దీంతో పాటు టైమ్స్ నౌ న్యూస్ ఇంటర్వ్యూలో వీరిద్దరు కలిసి ఆడిన జ్ణాపకాలను కూడా పంచుకున్నాడు గంగూలీ. ద్రవిడ్ నేను 1996లో ఇండియా ఇంగ్లాండ్ లార్డ్స్‌లో ఒకే టెస్ట్ మ్యాచ్‌లో భాగంగా ఇద్దరం ఒకేసారి అరంగేట్రం చేశామని, ఇద్దరం కలిసి అనేక టెస్ట్, వన్డే, టీ20 మ్యాచ్ లు ఆడామంటూ గంగూలీ తెలిపాడు.