విరాట్ కోహ్లీ.. ఏడాది క్రితం వరకు క్రికెట్ ప్రపంచాన్ని తన బ్యాట్ తో శాసించిన రారాజు. బౌలర్ ఎవరైనా, పిచ్ ఎలాంటిది అయినా, టార్గెట్ ఎంతైనా కోహ్లీ క్రీజ్ లోకి వచ్చాడంటే పరుగుల వరద పారాల్సిందే. కానీ.., గత కొంతకాలంగా ఈ లెక్క అంతా మారిపోయింది. కోహ్లీ ఫామ్ కోల్పోయాడు. కింగ్ కోహ్లీ సెంచరీ కొట్టి ఏళ్ళు గడిచిపోతున్నాయి. సెంచరీ మాట అటు ఉంచితే.. ఐపీఎల్ లో పట్టుమని పది పరుగులు కూడా చేయలేకపోతున్నాడు. కోహ్లీ క్రీజ్ లోకి రావడం, అవుట్ అయ్యి వెనుతిరగడం క్షణాల్లో జరిగిపోతుంది. గోల్డెన్ డక్ లకి కేరాఫ్ గా మారిపోయాడు కోహ్లీ. కోహ్లీ ఫ్యాన్స్ బాధ అయితే మాటల్లో చెప్పలేని విధంగా ఉంది. అయితే.., ఇప్పుడు వారికి షాక్ కలిగించేలా సోషల్ మీడియాలో మరో టాక్ వినిపిస్తోంది. అసలు ఇప్పుడు టీమిండియాలో కోహ్లీకి స్థానం ఉన్నట్టా? లేదా? అన్న చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది.
ఐపీఎల్ అయిపోయాక.. ఈ ఏడాది అక్టోబర్ లో టీ-20 వరల్డ్ కప్ జరగనుంది. ఇప్పడు ఆ మెగా టోర్నీకి ప్రకటించబోయే జట్టులో కోహ్లీ స్థానం ప్రశ్నార్ధకంగా మారింది. సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు మంచి ఫామ్ లో ఉన్నారు. వీరిలో ఎవ్వరినీ పక్కన పెట్టలేని పరిస్థితి ఓపెనర్ గా ఎలాగో రోహిత్, రాహుల్ ఫిక్స్. కీపర్ గా పంత్ ని కదిలించలేని పరిస్థితి. ఆల్ రౌండర్స్ కోటాలో హార్దిక్, జడేజా ఉండనే ఉన్నారు. ఇక్కడే 7 స్థానాలు ఫిల్ అయిపోయింది. ఇక మిగిలిన నాలుగు స్థానాల్లో బౌలర్లు ఉంటారు. దీంతో.. ఇప్పుడు కోహ్లీ స్థానంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.మరోవైపు.. కోహ్లీ విషయంలో ఏ చిన్న అవకాశం దొరికినా.. అతని స్థానానికి ఎసరు పెట్టడానికి గంగూలీ సిద్ధంగా ఉన్నాడన్నది ఓపెన్ సీక్రెట్. గతంలో గంగూలీని కూడా టీమ్ లో నుండి ఇలానే తీసేశారు. కాబట్టి.., వ్యక్తి అవసరాల కన్నా, టీమ్ ముఖ్యమని, గతంలో తన విషయంలో కూడా ఇదే జరిగిందని చెప్పి.. దాదా చేతులు దులుపుకునే వీలు కూడా ఉంది. కాబట్టి.. ఎలా చూసుకున్నా కోహ్లీ ఇపుడు డేంజర్ లోనే ఉన్నాడు. మిగిలిన ఈ ఐపీఎల్ మ్యాచ్ లలో అయినా.. కోహ్లీ సత్తా చూపిస్తే ఓకే. లేకుంటే మొదటికే మోసం వస్తుంది. మరి.. టీ-20 వరల్డ్ కప్ ఆడబోయే జట్టులో కోహ్లీకి స్థానం ఉండాలని మీరు కోరుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.