టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మళ్లీ గ్రౌండ్‌లోకి దిగుతున్నాడంటూ తనపై వస్తున్న వార్తలను ఖండించాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ రెండో ఎడిషన్‌లో తాను ఆడబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాడు. ఇంతకుముందు ఎల్‌ఎల్‌సీ నిర్వాహకులు ఒక పత్రికా ప్రకటనలో.. ‘ఇతర దిగ్గజాలతో ఆడటం చాలా సరదాగా ఉంటుంది అని గంగూలీ పేర్కొన్నట్లు ప్రస్తావించగా.. సదరు ప్రస్తావనను గంగూలీ తోసిపుచ్చాడు.
రెండో ఎడిషన్‌లో తాను పాల్గొనడం లేదని, అవన్నీ వట్టి పుకార్లంటూ కొట్టిపారేశాడు. గంగూలీ మాట్లాడుతూ.. ‘నో, నేను లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఆడట్లేదు. ఆ వార్త నిజం కాదు.’ అని స్పష్టం చేశాడు. కాగా ఈ లీగ్‌లో చాలా మంది ప్రముఖ క్రికెటర్లు ఆడనున్నారు. టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, షేన్ వాట్సన్, ఇయాన్ మోర్గాన్, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, ముత్తయ్య మురళీధరన్, మాంటీ పనేసర్ తదితరులు లెజెండ్స్ లీగ్ ఆడనున్నారు.
అలాగే హర్భజన్ సింగ్, బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మష్రాఫ్ మొర్తజా.. ఇటివల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కరేబియన్ ఆటగాళ్లు దినేష్ రామ్‌దిన్, లెండిల్ సిమన్స్ సైతం రెండో ఎడిషన్‌కు అందుబాటులోకి రాబోతున్నారు. ఇక లెజెండ్స్ లీగ్ క్రికెట్ సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ రామన్ రహేజా మాట్లాడుతూ.. హర్భజన్ గతేడాది జనవరిలో కోవిడ్ కారణంగా తొలి సీజన్ ఆడలేకపోయారు. ఇప్పుడు అతను లీగ్‌లోకి రావడం సంతోషంగా ఉంది. మైదానంలో అతని స్పిన్ మాయాజాలాన్ని మరోసారి చూడాలని ఎదురుచూస్తున్నాం.’ అని పేర్కొన్నాడు. మరి గంగూలీ లెజెండ్స్ క్రికెట్ లీగ్ ఆడకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Yesterday, @llct20 issued release saying #SouravGanguly will be part of tournament & organisers had even quoted him, however shortly after, Ganguly confirmed to NDTV that news isnt true. Further clarification from organisers awaited. #CricketTwitter https://t.co/pKhaRCWkGn
— Vishesh Roy (@vroy38) July 21, 2022