పొట్టి క్రికెట్ అంటేనే రికార్టుల మీద రికార్డులు, సెంచరీలు నమోదవుతాయి. చాన్స్ వస్తే చాలు దుమ్ముదులుపడానికి రెడీగా ఉంటారు. కొంత మంది క్రికెటర్లు అంతర్జాతీయ టోర్నమెంట్స్ లో అల్లాడిస్తే.. మరికొందరు టోర్నమెంట్లో అదర గొడుతున్నారు. మరీ ముఖ్యంగా యువ బ్యాటర్స్ అయిటే రెచ్చిపోయి ఆడతారు. తాజాగా విటాలిటీ టీ20 బ్లాస్ట్ టోర్మమెంట్ అలాంటి మెరుపులో కలనిపిస్తున్నాయి. శనివారం జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికన్ బ్యాటర్ రిలీ రోసోవ్ విధ్వసం సృష్టించాడు. ప్రత్యర్ధి బౌలర్ కు చుక్కలు చూపించాడు. కేవలం 36 బంతుల్లోనే 93 పరుగులు చేశాడంటే అతడి విధ్వంసం ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
విటాలిటీ టీ20 బ్లాస్ట్ టోర్మమెంట్ ఇంగ్లాండ్ లో సందడి చేస్తోంది. ఇప్పటివరకు చాలా అద్భుతమైన మ్యాచ్ లు జరిగాయి. అలాగే వ్యక్తిగత స్థాయిలో బలమైన ఆటతీరుతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈక్రమంలో శనివారం విటాలిటీ బ్లాస్ట్ టీ20 బ్లాస్ట్ లో భాగంగా సోమర్ సెట్ , డెర్బీషైర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికన్ క్రికెటర్ రిలీరోసోవ్ విధ్వంసం సృష్టించాడు. మ్యట్టీ మెకైర్నన్ వేసిన 15వ ఓవర్ లో 6,6,4,6,6,6 బౌండరీలతో విరుచుకపడ్డాడు. రెండు నోబాల్స్ కలిపి ఆ ఓవర్ లో 36 రన్స్ వచ్చాయి. మెక్‌కీర్నన్ నాలుగు ఓవర్ల వేసి 82 పరుగులు సమర్పించుకున్నాడు.
రిలీ రోసోవ్ కేవలం 36 బంతుల్లోనే 93 రన్స్ చేశాడు. కాగా మొదట బ్యాటింగ్ చేసిన సోమర్ సెట్ ఐదు వికెట్లు కోల్పోయి 265 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ దిగిన డెర్బీషైర్ జట్టు కేవలం 74 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. దీంతో 191 పరుగుల భారీ తేడాతో సోమర్ సెట్ విజయం సాధించింది. ఈ క్రమంలో టోర్నమెంట్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా సోమసెట్ జట్టు రికార్డు సృష్టించింది. సోమర్ సెట్ శనివారం హాంప్‌షైర్ హాక్స్‌తో సెమీ ఫైనల్ లో తనపడనుంది. ఈ మ్యాచ్ కి ఎడ్జ్‌బాస్టన్ వేదిక కానుంది. మరి.. రిలీ రోసోవ్ వీర విధ్వంసం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
WOW 😳
Rilee Rossouw scoring 3️⃣4️⃣ runs from an over 💪#Blast22 pic.twitter.com/3TY0uGnj58
— Vitality Blast (@VitalityBlast) July 9, 2022