మంచి ప్రదర్శన కనబర్చి.. భారత్ కోసం గోల్డ్ మెడల్ సాధిస్తామని ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్ స్మృతి మందాన అన్నారు. దాదాపు 24 ఏళ్ల తర్వాత కామన్‌వెల్త్ గేమ్స్‌లో క్రికెట్‌ను భాగం చేశారు. ఈ సారి కేవలం మహిళల క్రికెట్‌ను మాత్రమే అనుమతించారు. ఈ నెల 29 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌తో కామన్‌వెల్త్ గేమ్స్ 2022లో క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.
ఈ సందర్భంగా స్మృతి మందాన మాట్లాడుతూ.. ‘ తొలిసారి కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఆడేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నాం. కామన్‌వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్‌లలో భారత జాతీయ పతాకం అందరి కంటే పైకి ఎగిరితే మనం ఎంత గర్వపడతామో, ఎంత గొప్పగా ఫీల్ అవుతామో మీ అందరికి తెలిసిందే. ఇటివల ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించి మనందరిని ఎంతో గర్వపడేలా చేశాడు. మేము కూడా కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్ తరపున గోల్డ్ మెడల్ గెలిచేందుకు ప్రయత్నిస్తాం’ అని అన్నారు.
అయితే 1998లో తొలి సారి కౌల్హంపూర్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల వన్డే టోర్నీమెంట్ నిర్వహించారు. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ టోర్నీలు జరగలేదు. తిరిగి ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల టీ20 క్రికెట్‌ని ప్రవేశపెట్టబోతున్నారు. ఈ టోర్నీలో 8 దేశాల జట్టు పాల్గొనబోతున్నాయి. గ్రూప్ ఏలో భారత జట్టుతో పాటు పాకిస్థాన్, ఆస్ట్రేలియా, బార్బడోస్ జట్లు ఉన్నాయి.
ఈ టోర్నీలో భారత జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. అలాగే జులై 31న ఎడ్జ్‌బాస్టన్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లు ఇప్పటికే అమ్ముడైపోయాయి. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే చాలు.. ఉమెన్స్, మెన్స్ అనే తేడా లేకుండా భారీగా క్రేజ్ ఉంటుందన్ని విషయం తెలిసిందే. మరి కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్ ఏ పతకం సాధిస్తుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
💬 💬 We are aiming for Gold Medal at the Commonwealth Games: #TeamIndia vice-captain @mandhana_smriti. 👍 👍#B2022 pic.twitter.com/7Tsovu3Y12
— BCCI Women (@BCCIWomen) July 22, 2022