భారతదేశంలో పురుషుల క్రికెట్ తో పాటు మహిళా క్రికెట్ కు ఆదరణ పెరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే భారత్ వుమెన్స్ క్రికెటర్లు కూడా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా వుమెన్స్ జట్టు అద్భుతంగా రాణిస్తోంది. 2-1తో టీ20 సిరీస్ ను కోల్పోయినప్పటికీ వన్డే సిరీస్ ను ఘనంగా ఆరంభించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా అందం స్మృతి మంధాన 91 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలోనే తాజాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్ లో మంధాన దుమ్మురేపింది. ఏకంగా కెరీర్ లోనే అత్యుత్తమ ర్యాంక్ కు చేరుకుంది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
స్మృతి మంధాన.. అందంతోనే కాదు ఆటతోనూ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతోంది. ఆమె అందం ముందు .. ఆమె ఆట ముందు ర్యాంకింగ్స్ కూడా దిగిరాక తప్పలేదు. ఇంగ్లాండ్ తో తాజాగా జరిగిన 3 టీ20 మ్యాచ్ ల్లో ఓ అర్ద సెంచరీతో సహా 111 పరుగులు చేసింది. ఇదే ఫామ్ ను వన్డేలో సైతం కొనసాగించి తొలి వన్డేలో 91 పరుగులు చేసింది. అయితే ఈ క్రమంలోనే ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్ లో స్మృతి మంధాన 731 పాయింట్లతో కెరీర్ లోనే అత్యుత్తమ స్థానంలోకి దూసుకెళ్లింది. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్ లో టీ20లో 2వ స్థానంలోకి ఎగబాకింది. అయితే ఈ ర్యాంకింగ్ స్థానం రోహిత్, కోహ్లీ కన్నా అత్యుత్తమం కావడం విశేషం.
ఇక మెుదటి స్థానంలో ఆస్ట్రేలియా వుమెన్ బెత్ మోనీ 743 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మంధాన వన్డే ర్యాంకింగ్స్ ల్లో సైతం మూడు స్థానాలు ఎగబాకి 7వ స్థానంలో కొనసాగుతోంది. టీమిండియా మిగతా బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికి వస్తే.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 9వ స్థానానికి వచ్చింది. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్ లో దీప్తి శర్మ 12వ స్థానంలోకి ఎగబాకింది. మ్యాచ్ ను ఒంటి చేత్తో గెలిపించగల సత్తా భారత మహిళా క్రికెట్లో మంధాన సొంతం. మరి అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తూ.. కెరీర్ లో దూసుకెళ్తున్న స్మృతి మంధాన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#SmritiMandhana No.2 in latest ICC #T20 ranking for batters; displaces Australian stalwart Lanning
Read: https://t.co/geZRkwnEAr#ICCRankings
Photo: @mandhana_smriti/ Facebook pic.twitter.com/HuF9wCgCRI
— IANS (@ians_india) September 20, 2022
.@mandhana_smriti bags the Player of the Match award for a terrific unbeaten 7⃣9⃣-run knock as #TeamIndia beat England in the 2nd T20I to level the series. 👏👏
It all comes down to the decider to be played on Thursday. 👊
Scorecard ▶️ https://t.co/Xvs9EDrb2y #ENGvIND pic.twitter.com/WTwA7nXshP
— BCCI Women (@BCCIWomen) September 13, 2022