భారత మహిళా బ్యాటర్ స్మృతి మందాన వీర విహారం చేసింది. కొడితే సిక్సర్ లేదంటే బౌండరీ అన్నట్టుగా.. పరుగుల వరద పారించింది. ప్రతిష్టాత్మక కామన్‌వెల్త్ గేమ్స్ 2022లో భాగంగా సెమీఫైనల్స్ లో భారత జట్టు, ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా మహిళల జట్టుకు మంచి శుభారంభము లభించింది. క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే స్మృతి మందాన(61; 32 బంతుల్లో 8×4, 3×6) బాదడం మొదలు పెట్టింది. ఆమెకు తోడుగా షెఫాలీ వర్మ (15; 17 బంతుల్లో 2×4) దూకుడుగా ఆడటంతో భారత్ 6 ఓవర్లకే 64 పరుగులు చేసింది. ప్రస్తుతం 9 ఓవర్లు ముగిసేసరికి భారత స్కోర్: 2 వికెట్ల నష్టానికి 77 పరుగులు. హర్మన్ ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్ క్రీజులో ఉన్నారు.
🏏🔥 RAPID-FIRE! Smriti Mandhana brings up her 16th T20I fifty in style.
🙌 She broke her own record for the fastest T20I fifty by an Indian woman.
📸 Getty • #SmritiMandhana #ENGvIND #INDvENG #B2022 #CWG2022 #TeamIndia #BharatArmy pic.twitter.com/Xdqv06vf9R
— The Bharat Army (@thebharatarmy) August 6, 2022