భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డేలో అద్భుతమైన దృశ్యం కనిపించింది. మ్యాచ్ మొత్తం పెద్దగా ఏమనిపించలేదు కానీ స్మిత్ పట్టిన క్యాచ్ మాత్రం వావ్ అనేలా ఉంది. ఇంతకీ ఏం జరిగింది?
వైజాగ్ లో టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే జరిగింది. టీ20 మ్యాచులా చాలా అంటే చాలా తక్కువ ఓవర్లలోనే ముగిసింది. తక్కువ పరుగులే నమోదైన ఈ పోరులో భారత్ ఘోరంగా ఆడింది. ఫలితంగా ఓడిపోయింది కూడా. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో గెలిచేసింది. మొత్తంలో స్మిత్ పట్టిన క్యాచ్ మాత్రం సూపర్ హైలైట్ గా నిలిచిపోయింది. ఎందుకంటే చూస్తున్న ఎవరూ ఆ బంతిని క్యాచ్ పట్టొచ్చు అని అనుకోరు. కానీ రియాలిటీలో చేసి చూపించాడు స్మిత్. ఇప్పుడు దానికి సంబంధించిన ఓ వీడియోనే వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తొలి వన్డేలో గెలిచిన భారత్, రెండో మ్యాచులోనే ఆ సక్సెస్ ని కొనసాగించాలని అనుకుంది. కానీ ఆస్ట్రేలియా బౌలింగ్ దెబ్బకు చేతులెత్తేసింది. 26 ఓవర్లు మాత్రమే ఆడి 117 పరుగులకే ఆలౌటైంది. స్టార్క్ 5 వికెట్ల తీసి అద్భుతమైన బౌలింగ్ చేయగా.. అతడికి తోడు అబాట్ 3, నాథన్ ఎల్లిస్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ కి దిగిన ఆసీస్ జట్టు.. 11 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది. ట్రావిస్ హెడ్ 51, మిచెల్ మార్ష్ 66 పరుగులు చేయడంతో 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇక ఈ మ్యాచ్ చాలా తక్కువ టైంలోనే అయిపోయింది అనేది పక్కనబెడితే.. స్మిత్ పట్టిన క్యాచ్ మాత్రం ‘క్యాచ్ ఆఫ్ ది సెంచరీ’ అనలేమో! భారత ఇన్నింగ్స్ 5వ ఓవర్ లో నాలుగో బంతి కాస్త వైడ్ లా స్టార్క్ వేశాడు. అది రోహిత్ శర్మ బ్యాట్ కు తగిలి స్లిప్ లోకి వెళ్లింది. అక్కడే ఉన్నస్మిత్ దాన్ని ఒడుపుగా అందుకున్నాడు. ఇది జరిగిన కొంత టైం తర్వాత హార్దిక్ పాండ్యని అద్భుతమైన రీతిలో క్యాచ్ పట్టి ఔట్ చేశాడు. 10వ ఓవర్ అబాట్ వేశాడు. ఓ బంతిని క్రీజులో ఉన్న హార్దిక్ పాండ్య కట్ చేసే ప్రయత్నం చేశాడు. దీంతో స్లిప్ లో ఉన్న స్మిత్.. గాల్లోకి ఎగిరి మరీ బాల్ ని క్యాచ్ పట్టేశాడు. హార్దిక్ అయితే అలా షాక్ లోనే ఉండిపోయాడు. ఇప్పుడు ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మ్యాచ్ కాదు స్మిత్ క్యాచ్ గురించి అందరూ తెగ మాట్లాడుకుంటున్నారు. మరి ఈ క్యాచ్ మీకెలా అనిపించింది. కింద కామెంట్ చేయండి.
#SteveSmith catch of century Smithy you beauty 🔥🔥 pic.twitter.com/LQkuNvNQJO
— Zaheer Khan (@ZaheerK30866428) March 19, 2023