శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభం తారా స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో ఏకంగా అధ్యక్షుడు గోటబయ రాజపక్షే ఇంట్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో ఆయన దేశాన్ని విడిచి పారిపోయినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత.. ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే సైతం తన పదవికి రాజీనామా చేసినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. విదేశీ మారక నిల్వలు లేక.. ద్రవ్యోల్భణం తారా స్థాయికి చేరిపోవడంతో.. తినడానికి తిండిలేక లంక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న లంక ప్రజలకు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కృతజ్ఞతలు తెలిపాడు.
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి తినడానికి తిండి దొరకని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ లంకేయులు తమపై ఎంతో ఆదరాభిమానాలు కురిపించారని.. వారి ప్రేమ తమను కదిలించిందని వార్నర్ పేర్కొన్నాడు. లంక పర్యటనను సుఖంతంగా ముగించుకుని ఆస్ట్రేలియా తిరుగు ప్రయాణమైన నేపథ్యంలో వార్నర్ ఇంస్టాగ్రామ్ వేదికగా భావోద్వేగ నోట్ షేర్ చేశాడు.
David Warner shows his appreciation for Sri Lanka 🙌 #SLvAUS pic.twitter.com/mnrGI3luUd
— ESPNcricinfo (@ESPNcricinfo) July 11, 2022
“ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మాకు ఆతిథ్యమిచ్చినందుకు థాంక్యూ శ్రీలంక. ఇక్కడకు వచ్చినందుకు మేము చాలా కృతజ్ఞులం. మాపై మీరు చూపిన ప్రేమ, ఆదరణ మరవలేనిది. ఈ పర్యటనను మేము ఎప్పటికీ మరిచిపోలేం. మీ దేశంలో నాకు బాగా నచ్చిన విషయమేమిటంటే.. దేశంలో ఎంతటి దుర్భర పరిస్థితులు తలెత్తినా మీ ముఖం నుంచి చిరునవ్వు చెదరలేదు. మేం ఎక్కడికి వెళ్లినా ఎల్లవేళలా ఆదరించారు. థాంక్యూ. నేను నా కుటుంబంతో కలిసి ఇక్కడకు హాలీడేకు రావడానికి ఎదురుచూస్తున్నాను” అని రాసుకొచ్చాడు. ఈ పోస్టు చేస్తూ వార్నర్.. శ్రీలంక జాతీయ జెండాను షేర్ చేయడం గమనార్హం.
ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్లు నేరుగా శ్రీలంక పర్యటనకు వెళ్లారు. ఈ టూర్ లో ఆసీస్ జట్టు.. టీ20 సిరీస్ ను గెలుచుకున్నప్పటికీ వన్డే సిరీస్ ను కోల్పోయింది. రెండు మ్యాచుల టెస్టు సిరీస్ ను సమం చేసుకుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఫేక్ IPL! లైవ్ కామెంట్రీతో CSK, RCB, MI మ్యాచ్ లు!
ఇది కూడా చదవండి: Dinesh Chandimal: స్టేడియంలో సిక్స్ కొడితే.. రోడ్డు మీద కుర్రాడికి ఎక్కడో తగిలింది!