భారత మాజీ స్పిన్నర్ శివరామకృష్ణ సంచలన ఆరోపణలు చేశాడు. అది కూడా టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ పై. తనపట్ల ప్రవర్తించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేశాడు.
రాహుల్ ద్రవిడ్ పేరు చెప్పగానే భారత జట్టుకు అతడు అందించిన సేవలు ఫ్యాన్స్ అస్సలు మర్చిపోరు. బ్యాటర్ గా, కెప్టెన్ గా, వికెట్ కీపర్ గా ఇలా రోల్ ఏదైనా సరే తాను మాత్రం చాలా డెడికేషన్ చూపించేవాడు. చిన్న, చిన్న వివాదాలు మినహా.. ద్రవిడ్ కెరీర్ మొత్తం సక్సెస్ ఫుల్ గానే సాగింది. రిటైర్మెంట్ తర్వాత ద్రవిడ్.. యంగ్ ప్లేయర్లకు కోచ్ గా మారి తన సెకండ్ ఇన్నింగ్స్ లోనూ అదరగొట్టాడు. ఎంతో మంది కుర్ర ప్లేయర్లకు విలువైన సూచనలు ఇస్తూ వారి భవిష్యత్తుకి గట్టి పునాది వేశాడు. ఈ క్రమంలో టీంఇండియాకి కోచ్ గా ఎంట్రీ ఇచ్చాడు. కానీ భారత జట్టుకు కోచ్ అయిన దగ్గర నుంచి ద్రవిడ్ కి పెద్దగా కలిసి రావడం లేదని చెప్పాలి. ఒకప్పటిలా భారత్ విజయాలు సాధించలేకపోతుంది. గెలుపోటముల సంగతి పక్కన పెడితే.. ద్రవిడ్ ని విమర్శించేవారు ఎక్కువవుతున్నారు. తాజాగా ఆ లిస్టులోకి భారత మాజీ స్పిన్నర్ కూడా చేరాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. లక్ష్మణ్ శివరామకృష్ణ ఒకప్పటి భారత లెగ్ స్పిన్నర్.1983లో మన జట్టు తరపున అరంగ్రేటం చేసి కేవలం 9 టెస్టులు, 16 వన్డేలతో సరిపెట్టుకున్నాడు. ఇతను క్రికెటర్ గా కంటే కామెంటేటర్ గా అందరికీ సుపరిచితం. సరే ఇది పక్కనబెడితే భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ రీసెంట్ గా జరిగింది. స్వదేశంలో జరిగిన దీనిలో భారత్ ఓడిపోయింది. చివరి వన్డేలో ఆసీస్ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తే, భారత స్పిన్నర్లు చేతులెత్తేశారు. కుల్దీప్ తీసిన క్యారీ వికెట్ మినహా.. పెద్దగా చెప్పుకోవడానికి ఏమి లేదు. అదే టైంలో ఆసీస్ స్పిన్నర్లు జంపా, అగర్ కట్టుదిట్టమైన బౌలింగ్ తో భారత్ పనిపట్టారు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని ట్విట్టర్ లో.. ‘కుల్దీప్ బాగా బౌలింగ్ చేస్తున్నప్పుడు సరిగా ఫీల్డింగ్ సెట్ చేయలేదు. కానీ స్టీవ్ స్మిత్ మాత్రం జంపా, అగర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు అద్భుతమైన ఫీల్డ్ సెట్ చేసి ఫలితాన్ని రాబట్టాడు” అని శివరామకృష్ణ ని ట్యాగ్ చేశాడు.
ఈ ట్వీట్ పై స్పందించిన మాజీ లెగ్ స్పిన్నర్.. “ద్రవిడ్ టీమిండియా కోచ్ గా ఉన్నప్పుడు భారత జట్టు స్పిన్ విభాగానికి నేను కోచ్ గా ఉంటూ సలహాలు సూచనలు ఇస్తానని చెప్పాను. దానికి ఆయన ఒప్పుకోలేదు. మీరు నా కన్నా సీనియర్. నా కింద పనిచేయడం నాకిష్టం లేదనే పొంతనలేని సమాధానం చెప్పాడు” అని చెప్పుకొచ్చాడు. అభిమాని భారత ఫీల్డింగ్ గురించి అడిగితే.. శివ రామకృష్ణన్ మాత్రం భారత స్పిన్నర్లు విఫలయ్యారని పరోక్షంగా చెప్పుకొచ్చాడు. భారత జట్టుకు స్పిన్ కోచ్ అవసరం ఎతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేశాడు. మొత్తానికి ద్రవిడ్ తన విషయంలో ప్రవర్తించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం శివరామకృష్ణ మర్చిపోలేకపోతున్నాడని అనిపిస్తుంది. దీనిపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
Some how I felt @imkuldeep18 didn’t bowl to right field. When Zampa bowled Smith had a very good attacking field set. Again for Agar Smith field setting was perfect.(7 pff 3 on side field) Here is where you need experts @LaxmanSivarama1 https://t.co/XibhQvAagD
— RK (@trkbins) March 22, 2023