మొహమ్మద్ సిరాజ్.. ఐపీఎల్‌తో వెలుగులోకి వచ్చిన యువ సంచలనం. ఆ తర్వాత టీమిండియాలో చోటు సంపాదించి అదరగొడుతున్నాడు. హైదరాబాద్‌కు చెందిన సిరాజ్ తండ్రి ఒక ఆటో డ్రైవర్. చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన సిరాజ్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా తొలిసారి ఐపీఎల్ ద్వారా వచ్చిన సంపాదనతో మొట్టమొదటిగా ఏం కొన్నాడో చెప్పాడు. 2018లో తన ఐపీఎల్ సంపాదనతో ఐఫోన్ 7 మెడల్ సెల్‌ఫోన్‌తోపాటు ఒక సెకండ్ హ్యాండ్ కారు కొన్నట్లు పేర్కొన్నాడు.
Siraj, who finished as the highest wicket-taker for India with 13 scalps from 3 matches, posted a couple of videos on his Instagram showing off his new car#MohammedSiraj pic.twitter.com/EK0VRuDQON
— Editorji (@editorji) January 23, 2021
ఆ సమయంలో తనకు ఆ కారును ఎలా నడపాలో కూడా తెలియదని సిరాజ్ తెలిపాడు. కానీ ఆ సమయంలో ఐపీఎల్ ప్లేయర్‌కు కార్ ఉండాలనే నిబంధన వల్ల కారు కొన్నట్లు చెప్పాడు. కాగా సిరాజ్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు రూ.7 కోట్లకు రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. అంతకంటే ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉన్నా కూడా సిరాజ్ ఆర్సీబీతోనే ఉండేందుకు ఇష్టపడ్డాడు. మరి సిరాజ్ తొలి సంపాదనతో కొన్న వస్తువులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Siraj, who finished as the highest wicket-taker for India with 1⃣3⃣ from three matches, shared a short clip of his new car through an Instagram story.#MohammedSiraj #TeamIndia #IndianCricketTeam #INDvAUS #Cricket #TestCricket #Sports #SportsTiger pic.twitter.com/qDzDM26uxl
— SportsTiger (@sportstigerapp) January 23, 2021