ఐపీఎల్ 2023 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఒక బాంబు పేల్చాడు. గుజరాత్‌కు భవిష్యత్తులో కెప్టెన్ కాబోయే వ్యక్తి శుబ్‌మన్ గిల్ అంటూ పేర్కొన్నాడు. దీంతో పాండ్యా కెప్టెన్సీకి స్పాట్ పెట్టినట్లు అయింది.
భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ఐపీఎల్‌ల్లో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2022లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్‌కు పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించడమే కాకుండా ఆ జట్టును తొలి సీజన్‌లోనే ఛాంపియన్‌గా నిలిపాడు. గుజరాత్ కంటే ముందు ముంబై ఇండియన్స్‌లో ఆస్థాన క్రికెటర్‌గా ఉన్న పాండ్యా.. కెప్టెన్సీ ఆఫర్ రావడంతో కొత్త జట్టు గుజరాత్ ఫ్రాంచైజ్‌కు మారిపోయాడు. అలాగే కోల్‌కత్తా నైట్ రైడర్స్‌కు ఆడుతూ మంచి ప్రదర్శన కనబర్చిన శుబ్‌మన్ గిల్ సైతం గుజరాత్ టైటాన్స్‌కు మంచి ఆఫర్‌తో మారిపోయాడు. వీరితో పాటు సన్‌రైజర్స్‌కు ఆడుతున్న రషీద్ ఖాన్ సైతం గుజరాత్ టైటాన్స్‌కు మారిపోయాడు.
వీరు ముగ్గురు అద్భుతంగా రాణించడంతో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2022లో ఛాంపియన్‌గా నిలిచింది. ఐపీఎల్ 2023లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో గుజరాత్ టైటాన్స్ బరిలోకి దిగనుంది. ఈ సీజన్‌లో కూడా గుజరాత్‌ను ఛాంపియన్‌గా నిలపాలని ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే.. గుజరాత్ టైటాన్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పాండ్యాకు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. తమ జట్టు స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌లో లీడర్ షిప్ లక్షణాలు మెండుగా ఉన్నాయని, గుజరాత్ టైటాన్స్‌కు భవిష్యత్తు కెప్టెన్ గిల్ అని ఆయన పేర్కొన్నాడు. దీంతో రెండు మూడు సీజన్లు గుజరాత్ టైటాన్స్ ప్రదర్శన బాగాలేకున్నా, పాండ్యాకు గాయమైనా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా గిల్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో గిల్ రూపంలో పాండ్యాకు కొత్త తలనొప్పి వచ్చిపడినట్లు అయింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Gujarat Titans’ Director Of Cricket said, “Shubman Gill has leadership qualities and is very mature. He can be the future leader of Gujarat Titans”.
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 23, 2023