టీమిండియా వన్డే, టెస్టు జట్టులో సభ్యుడిగా ఉన్న యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ఇటివల వెస్టిండీస్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబర్చాడు. మూడు వన్డేల్లో రెండు అర్ధసెంచరీలతో అదరగొట్టాడు. మరో మ్యాచ్‌లో 44 పరుగులతో రాణించాడు. అలాగే చివరి వన్డేలో 98 పరుగుల వద్ద నాటౌట్‌గా నిలిచి.. వర్షం కారణంగా సెంచరీని మిస్ అయ్యాడు. గిల్ సెంచరీ మిస్ అయ్యేందుకు వర్షం ఒక కారణం అయితే.. అతని స్లో బ్యాటింగ్ కూడా ఒక కారణమంటూ అప్పుడే విమర్శలు కూడా వచ్చాయి.
నిజానికి గిల్ స్లో స్ట్రైక్ రేట్‌పై చాలా కాలంగా విమర్శలు ఉన్నాయి. వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో గిల్ 102.50 సగటుతో 205 పరుగులు చేశాడు. యాదృచ్ఛికంగా అతని స్ట్రైక్ రేట్ కూడా 102.50గా ఉండడం విశేషం. ఇదే విషయంపై గిల్ మాట్లాడుతూ.. తన స్లో స్ట్రైక్‌రేట్‌పై వస్తున్న విమర్శలకు, ప్రశ్నలకు రియాక్ట్ కానని చెప్పాడు. ‘నేను ఎలా ఆడినా నా బ్యాటింగ్‌పై ప్రశ్నలు కురిపిస్తారు. కానీ టీమ్ విజయానికి నేను నా వంతు సహకారం అందించినంత కాలం, టీమ్ మేనేజ్‌మెంట్, కెప్టెన్ ఆశించినట్లు ఆడినంత కాలం నా గురించి విమర్శకులు ఏం వాగినా నేను పట్టించుకోను. నా బ్యాటింగ్ స్టైల్ గురించి నాకు ఒక క్లారిటీ ఉంది’ అని గిల్ అన్నాడు.
అలాగే వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో తన ప్రదర్శనపై స్పందిస్తూ.. ‘నేను చాలా సంతృప్తిగా ఉన్నాను, మొదటి రెండు మ్యాచ్‌ల్లో నేను అవుట్ అయినందుకు కాస్త ఫీలైన మాట నిజమే. అలాగే విండీస్ గడ్డపై విలువైన పరుగులు చేయడం ఓవరాల్‌గా నాకు మంచి అనుభవాన్ని ఇచ్చింది.’ అని గిల్ వివరించాడు. గిల్ జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ కోసం ఎంపికయ్యాడు. కానీ.. ఆసియా కప్ కోసం గిల్‌ను ఎంపిక చేయలేదు. నిలకడగా రాణిస్తున్నా.. టీ20 ఫార్మాట్‌లో స్ట్రైక్‌రేట్ కూడా ఎంతో ముఖ్యం. కేవలం స్లో స్ట్రైక్‌రేట్ కారణంగానే గిల్‌కు టీమిండియా టీ20 జట్టులో చోటు దక్కడం లేదని క్రికెట్ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Team spirit ft. @ShubmanGill 💪#WIvIND #MenInBlue #TeamIndia pic.twitter.com/LxxeErag7h
— Gujarat Titans (@gujarat_titans) August 10, 2022
ఇది కూడా చదవండి: వైరల్ అవుతున్న ఇషాన్ కిషన్ పోస్ట్.. సెలక్టర్లకు కౌంటరా?