టీ20 వరల్డ్ కప్ కోసం రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ఒక టీమ్ ఆస్ట్రేలియా వెళ్లగా.. శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని మరో జట్టు సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే లక్నో వేదికగా తొలి వన్డే ముగిసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 9 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ ఓటమిని మరిచి రెండో వన్డేలో ఎలాగైన విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది యంగ్ టీమిండియా. రెండో వన్డే కోసం రాంజీ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ తర్వాత సరదా.. సరదా.. గడిపారు. టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్‌తో పాటు యువ క్రికెటర్లు శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ సిమ్మింగ్‌పుల్‌లో ఈతకొడుతూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ క్రమంలోనే ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్ తన ఫిజిక్‌ను ఎక్స్‌పోజ్ చేస్తూ.. ఎవరీకి ఎక్కువ బాడీ ఉందా అని పోటీ పడ్డారు.
ఈ సరదా కాంపిటీషన్లో శిఖర్ ధావన్ పాల్గొనలేదు. పిల్లలతో నాకేందుకులే అనుకున్నాడో ఏమో కానీ.. ఫోటోలు తీస్తూ పక్కకి ఉండిపోయాడు. ఈ సరదా ఫొటో షూట్‌లో శుబ్‌మన్ గిల్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించాడు. ప్రస్తుతం శుబ్‌మన్ గిల్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మంచి టాలెంటెడ్ క్రికెటర్ అయిన గిల్.. అంతే ఫిట్‌గా ఉన్నాడంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. ఈ సిమ్మింగ్‌పుల్‌కు సంబంధించిన ఫొటోలను శుబ్‌మన్ గిల్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేశాడు.
ఇకపోతే.. తొలి వన్డేలో ధావన్, గిల్, ఇషాన్ ముగ్గురికి ముగ్గురు దారుణంగా విఫలం అయ్యారు. ఇషాన్ కిషన్.. కొన్ని పరుగులు చేసినా.. మరీ నిదానంగా ఆడాడు. ఓపెనర్లుగా వచ్చిన గిల్, ధావన్ 3, 4 పరుగులు చేసి వెంటవెంటనే అవుట్ అయ్యారు. దీంతో టీమిండియా తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లారు. ఇలా భారత్ తొలి వన్డేలో ఓడింది. ఈ ఓటమి నుంచి పుంజుకుని.. తర్వాత రెండు వన్డేలు ఎలాగైన గెలిచి.. సిరీస్ విజయం సాధించాలని ధావన్ సేన పట్టుదలతో ఉంది. గతంలో ధావన్ కెప్టెన్సీలో టీమిండియా కొన్ని సిరీస్ విజయాలు సాధించిన విషయం తెలిసిందే.
☀️🏊 pic.twitter.com/sAwgn3sUYb
— Shubman Gill (@ShubmanGill) October 7, 2022