ప్రపంచంలోనే నంబర్‌వన్ ధనవంతుడు, టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మస్క్‌కు టీమిండియా క్రికెట్ శుభ్‌మన్ గిల్ ఒక రిక్వెస్ట్ చేశాడు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే ఫుడ్ డెలివరీ చేసే కంపెనీ స్విగ్గీని కొనాలని కోరాడు. ఎలన్‌మస్క్ స్విగ్గీని కంటే కరెక్ట్ టైమ్‌కి ఆర్డర్ వస్తుందని గిల్ సరదాగా తన సోషల్ మీడియో అకౌంట్‌లో పోస్టు చేశాడు. గిల్ స్విగ్గీలో ఏదో ఆర్డర్ చేస్తే.. టైమ్‌కు రాలేదేమో అందుకే ఇలాంటి కామెంట్ చేశాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
కాగా ఇటివల ఎలన్ మస్క్ ట్విట్టర్‌ను ఆన్‌లైన్‌లో బేరమాడి మూడు లక్షల కోట్లుకు పైగా ధర పెట్టి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఎలన్ మస్క్ పెద్దగా హడావిడి లేకుండా.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన ట్విట్టర్‌ను కొనేయడం ప్రపంచ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పుడు శుభ్‌మన్ గిల్ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ ట్విట్ చేసినట్లు అర్థం అవుతుంది. మరి గిల్ అభ్యర్థనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Quinton De Kock: గ్రౌండ్ నుంచి బయటికి వెళ్లిన డికాక్! సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
Elon musk, please buy swiggy so they can deliver on time. @elonmusk #swiggy
— Shubman Gill (@ShubmanGill) April 29, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.