టీమిండియాకు బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఎలాంటి లోటు లేదు. ఎందుకంటే పదుల సంఖ్యలో ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారు. కాకపోతే వాళ్లలో చాలామంది నిలకడ లేకపోవడం అనే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. సీనియర్లు తప్పించి.. వచ్చిన కుర్రాళ్లకు గాయాలవడం, ఇచ్చిన ఛాన్సులని సరిగా యూజ్ చేసుకోకపోవడం జరుగుతుంది. దీని ఎఫెక్ట్ ఐసీసీ టోర్నీలపై గట్టిగానే పడుతుంది. ఫలితంగా విజేతగా నిలుస్తుంది అనే అంచనాలతో టోర్నీలో అడుగుపెట్టిన మన జట్టు కాస్త.. లీగ్, సెమీస్ దశలో ఇంటిముఖం పట్టాల్సి వస్తుంది. అయితే ఇప్పుడిప్పుడే జట్టులోని కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతున్నట్లు కనిపిస్తున్నాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీమిండియా కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనీ తనదైన ముద్ర వేశాడు. అంతకు ముందు గంగూలీ, ద్రవిడ్ లాంటి వాళ్లు సారథిగా ఉన్నప్పటికీ.. ద్వైపాక్షిక సిరీసుల్లో విజయాలు తప్పించి.. ఐసీసీ కప్స్ అయితే సాధించలేకపోయారు. ధోనీ మాత్రం టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ.. ఇలా మూడు ఐసీసీ కప్ లను ఆరేళ్ల వ్యవధిలో తెచ్చిపెట్టాడు. కానీ ధోనీ కెప్టెన్ గా తప్పుకొన్న తర్వాత భారత జట్టు బ్యాడ్ లక్ మళ్లీ యధావిధిగా తయారైంది. కోహ్లీ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాల్లో మ్యాచులు గెలిచి సరికొత్త రికార్డులు సృష్టించింది. అదే విరాట్ కెప్టెన్సీలో ఐసీసీ ట్రోఫీ మాత్రం సాధించలేకపోయింది.
ఇక 2021 టీ20 ప్రపంచకప్ తర్వాత కోహ్లీని కాదని రోహిత్ ని అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ ని చేశారు. కానీ పెద్దగా లక్ అయితే ఏం మారలేదు. ఇక కెప్టెన్ అయిన దగ్గర నుంచి రోహిత్ నుంచి ఒక్కటంటే ఒక్క సరైన ఇన్నింగ్స్ రావడం లేదు. అదే టైంలో శిఖర్ ధావన్ ని కూడా జట్టు నుంచి దాదాపుగా తప్పించేశారు. దీంతో ఓపెనింగ్ సమస్య ఏర్పడింది. కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, శుభ్ మన్ గిల్, రోహిత్ శర్మ.. ఇలా ఒక్కో మ్యాచులో ఒక్కో జోడీ దిగుతోంది. అయితే తాజాగా న్యూజిలాండ్ తో తొలి వన్డేలో డబుల్ సెంచరీ కొట్టిన గిల్.. నెమ్మదిగా ఆడుతాడనే కామెంట్స్ కి చెక్ పెట్టాడు. భారత జట్టు ఫ్యూచర్ ఓపెనర్ తానేనని బల్లగుద్ది మరీ క్లారిటీ ఇచ్చేశాడు.
బంగ్లాదేశ్ తో డబుల్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ ని కాదని గిల్ కు ఓపెనర్ గా ఛాన్స్ ఇచ్చారేంటని చాలామంది అన్నారు. వన్డేలు, టీ20లకు అతడి వేగం సరిపోతుందా అని సందేహపడ్డారు. చాలామంది కుర్రాళ్లుండగా అతడికే ఎందుకు ఛాన్స్ ఇచ్చారని బీసీసీఐని ప్రశ్నించారు. ఇప్పుడు ఆ ప్రశ్నలకు ఒక్కో దానికి ఆన్సర్ ఇచ్చిన గిల్.. శ్రీలంకపై హాఫ్ సెంచరీ, సెంచరీ చేశాడు. ఇప్పుడు న్యూజిలాండ్ పై ఏకంగా డబుల్ సెంచరీ చేసి వావ్ అనిపించాడు. ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే ప్రపంచకప్ లో తనని ఓపెనర్ గా తీసుకోకపోతే కుదరదు అనే సందిగ్ధంలో పడేశాడు. గత కొన్నాళ్ల నుంచి ధావన్, కేఎల్ రాహుల్ వైఫల్యంతో ఓపెనింగ్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్న భారత్ జట్టుకు గిల్ రూపంలో ఆన్సర్ దొరికింది. ఇక ఇషాన్ కిషన్ కూడా సెట్ అయిపోతే.. వీళ్లిద్దరూ టీమిండియాకు పెర్మినెంట్ ఓపెనర్స్ అయిపోతారనిపిస్తోంది. మరి గిల్-ఇషాన్ జోడీపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయం చెప్పండి.
Shubman Gill is just 23, he is the future.
A legend in making. pic.twitter.com/zCNpjSTESQ
— Johns. (@CricCrazyJohns) January 18, 2023