ఐపీఎల్ 2022 సీజన్ ముగిసి 6 నెలలు కూడా పూర్తి కాలేదు.. అప్పుడే, ఐపీఎల్ 2023 వేట మొదలైంది. టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ చేసిన ట్వీట్ అందుకు నిదర్శనం. రాబోవు సీజన్ లో గుజరాత్ టైటాన్స్ లు ఆడట్లేనని చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని గుజరాత్ టైటాన్సే ట్విటర్ వేదికగా ప్రకటించింది. శుభ్‌మన్ గిల్ భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించింది. అయితే.. ఇక్కడ మరో వార్త హల్ చేస్తోంది. గిల్ తో ముఖేష్ అంబానీ లోపకాయిరి ఒప్పందం చేసుకున్నట్టు వార్తలొస్తున్నాయి.
ఐపీఎల్ 2023 ముందు గుజరాత్ టైటాన్స్‌కు ఆ జట్టు స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఊహించని షాకిచ్చాడు. అప్‌కమింగ్ సీజన్‌లో గుజరాత్ తరఫున ఆడలేనని చెప్పకనే చెప్పాడు. ట్రేడింగ్ ద్వారా ముంబై జట్టులోకి వెళ్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఈ విషయంపై, గుజరాత్ యాజమాన్యం కూడా స్పందించింది. తమ జట్టుతో కొనసాగిన అతని ప్రయాణం అద్భుతమని ప్రశంసించింది. ‘శుభ్‌మన్ నీ ప్రయాణం గుర్తించుకోదగినది. నీ భవిష్యత్తు మరింత అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాం’ అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు శుభ్‌మన్ సైతం లవ్ యూ అనే ఏమోజీతో బదులిచ్చాడు.
Has Shubman Gill left Gujarat Titans?#Cricket #IPL2023 #GujaratTitans #IndianCricket #TeamIndia #KKR pic.twitter.com/BAA3qTZdsx
— CRICKETNMORE (@cricketnmore) September 17, 2022
ఈ వార్త నిజామా? కాదా? అన్న సందిగ్ధంలో పడ్డారు.. అభిమానులు. ఐపీఎల్ 2022 సీజన్ లో గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలవడంలో శుభ్‌మన్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసందే. 16 మ్యాచుల్లో 132 స్ట్రైక్ రేట్ తో 483 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు ఉన్నాయి. అలాంటి అతగాడిని టైటాన్స్ ఏ మాత్రం వదలుకోదని, ప్రాంక్ చేస్తున్నారని సోషల్ మీడియాలో బదులిస్తున్నారు. అయితే.. మరికొందరు మాత్రం ట్రేడింగ్ ద్వారా శుభ్‌మన్ గిల్ ముంబై ఇండియన్స్‌లోకి వెళ్లే అవకాశం ఉందని సందేహిస్తున్నారు. బిజినెస్ పరంగా ఆశ చూపి ముఖేష్ అంబానీ, గిల్‌ను ముంబై జట్టులోకి లాగేసుకున్నాడని కొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ విషయంపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🤗❤️
— Shubman Gill (@ShubmanGill) September 17, 2022