టీమిండియా క్రికెటర్లు, హీరోయిన్లు నెవర్ ఎండింగ్ కాంబినేషన్. ఎందుకంటే విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ, యువరాజ్-హెజెల్ కీచ్, హర్భజన్ సింగ్-గీతా బస్రా, హార్దిక్ పాండ్య-నటాషా స్టాంకోవిచ్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా జంటలే ఉన్నాయి. హీరోయిన్సే అనే కాదు లేడీ యాక్టర్స్, మోడల్స్ ని పెళ్లి చేసుకున్న క్రికెటర్లలో చాలామంది ఉంటారు. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో యువ క్రికెటర్ చేరేలా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చేసింది. ఇది కాస్త అటు టీమిండియా, ఇటు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీమిండియా క్రికెటర్ శుభ్ మన్ గిల్ పేరు చెప్పగానే క్లాస్ బ్యాటింగ్ గుర్తొస్తుంది. ఐపీఎల్, టీమిండియా తరఫున అవకాశం దొరికిన ప్రతిసారి కూడా తనకు తాను నిరూపించుకున్నాడు. గ్లామర్ విషయంలో మనోడు అస్సలు తగ్గడు. గిల్ ఇన్ స్టా పోస్టులు చూస్తే మీకు ఈ విషయం క్లియర్ గా అర్థమైపోతుంది. ఇకపోతే సచిన్ కుమార్తె సారా టెండుల్కర్ తో గిల్ ప్రేమలో ఉన్నాడని కొన్నేళ్ల ముందు రూమర్స్ వచ్చాయి. ఇన్ స్టాలో ఒకరి పోస్టులకు మరొకరు లైకులు కొట్టడం, కామెంట్ చేయడంతో అందరూ ఈ విషయం మాట్లాడుకున్నారు. ఇక ఆ తర్వాత ఇద్దరూ సైలెంట్ అయిపోవడంతో అందరూ సారా-గిల్ గురించి మర్చిపోయారు.
ఇక ఈ ఆగస్టులో హీరోయిన్ సారా అలీఖాన్ తో గిల్ డిన్నర్ కి వెళ్లాడు. దీన్ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అందరూ వీళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారా? అని మాట్లాడుకున్నారు. కాకపోతే సారా-గిల్ ఎవరూ కూడా రెస్పాండ్ కాలేదు. ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు ఏకంగా సారా అలీఖాన్ తో డేటింగ్ పై గిల్ అసలు విషయం బయటపెట్టేశాడు. ‘దిల్ దియాన్ గలాన్’ టాక్ షోలో తాజాగా పాల్గొన్న గిల్.. పలు విషయాలు మాట్లాడాడు. ‘నీ పరంగా చూస్తే బాలీవుడ్ లో ఫిట్టెస్ట్ ఫిమేల్ యాక్టర్ ఎవరు?’ అని హోస్ట్ సోనమ్ అడగ్గా.. తడుముకోకుండా సారా అలీఖాన్ పేరు చెప్పాడు. ‘మీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారా?’ అడగ్గా.. ‘మే బీ(బహుశా ఉండొచ్చు)’ అని చెప్పి వ్యూయర్స్ ని కన్ఫ్యూజన్ లో పడేశాడు. గిల్ చెప్పిన దాని బట్టి చూస్తుంటే వీరిద్దరి మధ్య సమ్ థింగ్ ఉందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.