ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్‌గా పరుగుల వరద పారించిన సచిన్ టెండూల్కర్ ఎన్నో రికార్డులను నెలకొల్పాడు. దాదాపు 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో లెక్కలేనన్ని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. అందుకే అతను ఇండియన్ క్రికెట్‌కు గాడ్ అయ్యాడు. సచిన్ సృష్టించిన చాలా రికార్డుల్లో కొన్ని బ్రేక్ అయ్యాయి.. అవుతున్నాయి. కానీ.. వాటిలో కొన్ని మాత్రం ఎవరెస్ట్ శిఖరంలా ఎన్ని ఏళ్ల గడుస్తున్నా.. పటిష్టంగా ఉన్నాయి. సచిన్ 100 సెంచరీల రికార్డు అయితే ఇప్పట్లో కాదు కదా.. ఇంకా వందేళ్లు అయినా బ్రేక్ అయ్యేలా కనిపించడం లేదు. ఆ రికార్డును బద్దలు కొడతాడని భావించిన కోహ్లీ.. మూడేళ్లు డల్ అవ్వడంతో అతనిపై కూడా ఆశలు సన్నగిల్లాయి. 74 సెంచరీలతో ఉన్న కోహ్లీ.. సచిన్‌ను దాటాలంటే మరో 27 సెంచరీలు చేయాలి. అది దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది. ఆ రికార్డు విషయం పక్కన పెడితే.. మరో అరుదైన, పాతికేళ్లుగా చెక్కుచెదరని రికార్డు గురించి క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఆ రికార్డు ఏంటంటే.. ఒక ఏడాది కాలంలో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా సచిన్ పేరు రికార్డుల పుటలో అగ్రస్థానంలో ఉంది. 1998లో సచిన్ కేవలం 34 వన్డేలు 33 ఇన్నింగ్స్‌ల్లో 1894 పరుగులు బాదాడు. ఆ ఏడాది మొత్తం 9 సెంచరీలు, 7 అర్ధ సెంచరీలతో సచిన్ ప్రపంచ రికార్డును సృష్టించాడు. వన్డే క్రికెట్‌లో అతి తక్కువ మ్యాచ్‌ల్లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడు సచినే.. అలాగే వన్డేల్లో ఒక ఏడాది కాలంలో అత్యధిక పరుగులు చేసిన వన్డే బ్యాటర్ కూడా సచినే. అతని తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఉన్నాడు. గంగూలీ 1999లో 41 వన్డేల్లో 1767 పరుగులు సాధించాడు. అయితే.. 1998 నుంచి ఇప్పటి వరకు కూడా సచిన్ రికార్డును కొట్టే బ్యాటర్ రాలేదు. 2019లో మాత్రమే ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 28 మ్యాచ్‌ల్లో 27 ఇన్నింగ్స్‌లు ఆడి 1490 పరుగులు చేసి.. దగ్గరగా వచ్చాడు. కానీ.. సచిన్ రికార్డును బ్రేక్ చేయలేకపోయాడు.
కాగా.. ఆ అరుదైన రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ ఇప్పుడు ఓ యువ క్రికెటర్‌ను ఊరిస్తోంది. ఆ యువ క్రికెటర్ మరెవరో కాదు ఇటివల డబుల్ సెంచరీతో దుమ్ములేపిన శుబ్‌మన్ గిల్. 2023 ఏడాదిని అద్భుతంగా మొదలుపెట్టిన గిల్.. అదే ఊపును కొనసాగిస్తున్నాడు. వన్డేల్లో రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ఈ యువ క్రికెటర్.. సెంచరీలతో సత్తా చాటుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు 6 వన్డేలు ఆడిన గిల్ 567 పరుగులు చేశాడు. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్‌తో కలుపుకుని టీమిండియా మరో 21 వన్డేల వరకు ఆడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌ల్లోనూ గిల్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. 32 ఇన్నింగ్స్‌ల్లో 1895 పరుగులు పూర్తి చేసుకుంటే.. 25 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డును బద్దలు కొట్టిన ఆటగాడిగా చరిత్రలో నిలిచిపోతాడు. ఈ రికార్డు బ్రేక్ చేస్తే.. యువ క్రికెటర్లను సదా ప్రొత్సహించే సచిన్ సైతం గిల్‌ను అభినందించి తీరుతారనడంలో సందేహం లేదు. మరి గిల్.. సచిన్ రికార్డును బ్రేక్ చేస్తాడని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#SachinTendulkar 1894 runs in 1998 is a world record in men’s ODIs for a single calendar year. This is a #WorldCup2023 year, it is still only January and #shubhmangill has 567 runs @ShubmanGill
-A post from @sachin_rt Pakistani fan page pic.twitter.com/iiD1ElcchO
— Sachin’s Legacy (@LegacyOfSachin) January 27, 2023