గత కొంత కాలంగా టీమిండియా ఆటగాడు చాహల్ భార్య ధన శ్రీ వర్మతో కనిపిస్తూ.. తరచుగా వార్తల్లో నిలుస్తున్నాడు శ్రేయస్ అయ్యర్. దాంతో వీరిద్దరు తరచుగా ఫొటోల్లో కనిపిస్తుండటంతో.. సోషల్ మీడియాలో పలు రకాలైన కామెంట్స్ వినిపించాయి. తాజాగా మరోసారి వీరిద్దరు కలిసి ఓ ఫోటోలో కనిపించారు.
టీమిండియా స్టార్ బ్యాటర్, కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా ఐపీఎల్ 2023కి దూరం అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. కానీ వార్తల్లో నిలుస్తున్నాడు. అదెలా అంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే. గత కొంత కాలంగా టీమిండియా ఆటగాడు చాహల్ భార్య ధన శ్రీ వర్మతో కనిపిస్తూ.. తరచుగా వార్తల్లో నిలుస్తున్నాడు శ్రేయస్ అయ్యర్. దాంతో వీరిద్దరు తరచుగా ఫొటోల్లో కనిపిస్తుండటంతో.. సోషల్ మీడియాలో పలు రకాలైన కామెంట్స్ వినిపించాయి. త్వరలోనే చాహల్ తన భార్యతో విడాకులు తీసుకోబోతున్నాడు అంటూ వార్తలు సైతం వినిపించాయి. అయితే ఈ న్యూస్ ను కొట్టిపారేసింది చాహల్-ధనశ్రీ జంట. తాజాగా మరోసారి చాహల్ భార్య ధనశ్రీ దిగిన ఫోటోలు శ్రేయస్ కనిపించిన ఫొటో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ధనశ్రీ వర్మ.. కొరియోగ్రఫర్ గా, సోషల్ మీడియా ఇన్ ప్లుయెన్సర్ గా, డాక్టర్ గా చాహల్ భార్యగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో తన డ్యాన్స్ వీడియోలతో తెగ యాక్టీవ్ గా ఉంటుంది ఈ అమ్మడు. ఈ క్రమంలోనే తాజాగా ధనశ్రీ వర్మ షేర్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ‘మై క్యూటీస్’ అంటూ హార్ట్ ఎమోజీతో తన స్నేహితులు ఉన్న ఫోటోను పంచుకుంది. అయితే ఈ పిక్ లో ఓ మూలన శ్రేయస్ అయ్యర్ ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాగా గతంలో.. టీమిండియా ఆటగాడు సూర్యకుమార్-దేవిషా దంపతులతో శ్రేయస్-ధనశ్రీ దిగిన పిక్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. అదీకాక శార్దూల్ ఠాకూర్ పెళ్లిలోనూ వీరిద్దరు కలిసి దిగిన పిక్స్ వైరల్ గా మారాయి.
దాంతో శ్రేయస్-ధనశ్రీ మధ్య ఏదో నడుస్తోంది అన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తకు బలం చేకూర్చే విధంగా ధనశ్రీ తన ఇన్ స్టా అకౌంట్ నుంచి చాహల్ ఇంటి పేరును తొలగించడంతో.. వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారు అన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలను ఖండిస్తూ.. చాహల్-ధనశ్రీ జంట ఓ వీడియోను విడుదల చేశారు. దాంతో ఈ పుకార్లకు అడ్డుకట్టపడింది. అయితే తరచుగా శ్రేయస్, ధనశ్రీలు కలిసి కనిపించడానికి కారణం ఏంటంటే? శ్రేయస్ సోదరి శ్రేష్ఠ కొరియోగ్రాఫర్ కావాలని కలలు కంటోంది. ఇక ధనశ్రీ కొరియోగ్రాఫర్ కావడంతో.. తనతో ఫ్రెండ్ షిప్ చేయడం ప్రారంభించింది శ్రేష్ఠ.
ఈ క్రమంలోనే శ్రేష్ఠతో పాటుగానే శ్రేయస్ కూడా ధనశ్రీకి ఫ్రెండ్ గా మారాడు. ఆ స్నేహం కారణంగానే స్నేహితుల ఇంట్లో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు ఇద్దరు. దాంతో మరోసారి సోషల్ మీడియాలో శ్రేయస్-ధనశ్రీలు ట్రెండింగ్ లోకి వచ్చారు. ఇక ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఫ్రెండ్ సోదరుడితో స్నేహం చేస్తే పెడార్థాలు తీస్తారా? అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఏదో ఒక రకంగా ధనశ్రీ వార్తల్లో నిలవడానికి చూస్తోంది అంటూ విమర్శిస్తున్నారు. ఇంకోదరేమో చాహల్ ఐపీఎల్ లో బీజీగా ఉంటే తను మాత్రం ఇలా ఫోటోలు దిగుతోంది అంటూ విమర్శిస్తున్నారు. మరి ధనశ్రీ వర్మ ఇలా తరచుగా శ్రేయస్ తో కనిపించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.