టీమిండియా స్టార్ క్రికెటర్లును గాయాలు వేధిస్తున్నాయి. ఇప్పటికే బుమ్రా ఐపీఎల్‌కు దూరమైన విషయం తెలిసిందే. అతని బాటలోనే మరో స్టార్ క్రికెటర్ కూడా ఐపీఎల్‌కు దూరం అయ్యేలా ఉన్నాడు. అతని గైర్హాజరీతో కేకేఆర్ తీవ్ర ఇబ్బంది పడే అవకాశం ఉంది.
ఫామ్‌లో ఉన్న ఆటగాళ్ల గాయాలు ఆ జట్టు మీద గట్టిగానే ప్రభావం చూపిస్తాయి. క్రికెట్లో ఆటగాళ్లకు గాయాలవ్వడం సహజమే అయినా.. ఆ గాయాలు తిరగబెట్టి తరచూ ఆటకు దూరమవుతుంటే అతని కెరీర్ కూడా ప్రమాదంలో పడుతుంది. ప్రస్తుత భారత జట్టులో గాయాల బెడద ఎక్కువగా ఉంది. జడేజా గాయం కారణంగా గత కొన్ని నెలలు క్రికెట్ కి దూరమైన సంగతి తెలిసిందే. చాలా రోజుల విరామం తర్వాత గాయం నుంచి కోలుకొని బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆడాడు. ఇక బుమ్రా అయితే.. వెన్నునొప్పి కారణంగా చాలా కాలంగా జట్టులో లేడు. ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ 2022తో పాటు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి దూరమైన బుమ్రా.. ఐపీఎల్ తో పాటుగా డబ్ల్యూటీసీ ఫైనల్, ఆసియా కప్ కి కూడా దూరం కానున్నాడు. తాజాగా టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కూడా వెన్ను గాయంతో జట్టుకి దూరం అయ్యాడు.
ప్రస్తుతం టీం ఇండియాలో అద్భుత ఫామ్ లో ఉన్న ఆటగాడు శ్రేయాస్ అయ్యర్. ఫార్మాట్ ఏదైనా గత కొన్ని నెలలుగా అయ్యర్ అదరగొట్టేస్తున్నాడు. ఈ క్రమంలో టీం ఇండియా కి కీలక ప్లేయర్ గా మారాడు. ఈ ఏడాది ప్రారంభంలో శ్రీలంకతో సిరీస్ సందర్భంగా త జట్టుకి దూరమైన అయ్యర్.. ఇటీవల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీలో జరిగిన రెండో టెస్టుతో పునరాగమనం చేసాడు. అయితే అహ్మదాబాద్ లో జరుగుతున్న నాలుగో టెస్టులో వెన్ను గాయం తిరగబెట్టడంతో అయ్యర్ బ్యాటింగ్ కి దిగలేదు. దీంతో అయ్యర్ ని స్కానింగ్ కి పంపించగా గాయం నుంచి కోలుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశముందని వైద్యులు సూచించారు. దీంతో అయ్యర్ ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ తో పాటుగా.. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లకు కూడా దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ విషయం కోల్‌కత్తా నైట్ రైడర్స్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.
ఐపీఎల్లో కొంచెం బలహీనంగా ఉన్నజట్లలో కోల్ కత్తా నైట్ రైడర్స్ ఒకటి. అయితే ఇప్పుడు కెప్టెన్ అయ్యర్ దూరమవ్వడం ఆ జట్టుని మరింత వీక్ చేయనుంది. ఒకవేళ అయ్యర్ దూరమైతే కోల్ కత్తా జట్టుకి బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం ఉంది. షకీబ్ ఇటీవలే స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగిన టీ 20 సిరీస్ లో బంగ్లాదేశ్ కి సిరీస్ విజయాన్ని అందించి మంచి ఊపు మీద ఉన్నాడు. ఈ నేపథ్యంలో కోల్ కత్తా యాజమాన్యం షకీబ్ వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. మొత్తానికి ఇటు టీం ఇండియా.. అటు కోల్ కత్తా జట్లు అయ్యర్ సేవలను కోల్పోనున్నాయి. మరి అయ్యర్ ఐపీఎల్‌లో ఆరంభం మ్యాచ్‌లకు దూరం కావడం, అతని స్థానంలో షకీబ్ కెప్టెన్‌గా ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🚨 REPORTS 🚨
Kolkata captain Shreyas Iyer set to miss the first few matches of IPL 2023 🏆#IPL2023 pic.twitter.com/N3STy8yufK
— SportsBash (@thesportsbash) March 13, 2023