భారత్-శ్రీలంక మధ్య మూడు టీ20 మ్యాచ్‌లో సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 3-0తో శ్రీలంకను వైట్‌వాష్ చేసింది. ఈ మ్యాచ్‌లో కూడా శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 45 బంతుల్లో 73 పరుగులు చేసి.. వరుసగా మూడు మ్యాచ్‌లలో మూడు అర్ధ శతకాలను నమోదు చేశాడు. అలాగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. గతంలో ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. కోహ్లీ మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో 199 పరుగులతో టాప్‌లో ఉండగా.. తాజాగా 204 పరుగులతో శ్రేయస్ అయ్యర్ ఆ రికార్డును బద్దలుకొట్టాడు.
ఐపీఎల్‌తో వెలుగులోకి వచ్చిన శ్రేయస్.. టీమిండియాలో తన స్థానం సుస్థిరం చేసేకునేందుకు చాలా సమయమే తీసుకున్నాడు. 2017లోనే జాతీయ జట్టులోకి వచ్చిన అయ్యర్.. నిలకడలేమి, గాయాలతో జట్టులోకి వస్తూ.. పోతూ ఉన్నాడు. కానీ.. ఐపీఎల్‌లో మాత్రం ఎప్పుడూ డిమాండ్ ఉన్న ఆటగాడిగా ఉన్నాడు. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్ అయినా అయ్యర్ ఆ జట్టును విజయవంతంగా నడిపించాడు. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ కోచ్‌గా ఉన్న ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా ఉంటూ 2020లో ఆ జట్టును తొలిసారి ఫైనల్స్‌కు చేర్చాడు. కానీ 2021లో గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరం అయ్యాడు. 2021 సీజన్‌లో ఢిల్లీకి రిషభ్ పంత్.. అయ్యర్ స్థానంలో తాత్కాలిక కెప్టెన్‌గా ఉన్నాడు.
ఐపీఎల్ 2021 సీజన్ రెండో భాగంలో అయ్యర్ జట్టులోకి వచ్చినా.. అతని కెప్టెన్సీ అప్పగించలేదు ఢిల్లీ మేనేజ్‌మెంట్. ఆ సమయంలో ఢిల్లీకి కోచ్‌గా ఉన్న పాంటింగ్ అయ్యర్‌ను కాదని పంత్‌నే కెప్టెన్‌గా కొనసాగించేందుకు మొగ్గు చూపడంతో మేనేజ్‌మెంట్ కూడా కామ్‌గా ఉన్నట్లు సమాచారం. జట్టులోకి తిరిగి వచ్చిన తర్వాత కెప్టెన్సీ ఇవ్వకపోవడంతో పాటు 2021 సీజన్ తర్వాత అయ్యర్‌ను ఢిల్లీ రిటేన్ చేసుకోలేదు. దీని వెనుక కూడా పాంటింగ్ హస్తం ఉన్నట్లు సమాచారం. ఇలా అయ్యర్‌ను కెప్టెన్సీకి, ఢిల్లీ జట్టుకు దూరం చేసి తనను అవమానించాడనే కసితో అయ్యర్ ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే పాంటింగ్‌ను తన సత్తా చూపించేందుకే గాయం నుంచి పూర్తిగా కోలుకుని అద్భుతమైన ఫిట్ నెస్ సాధించి.. సూపర్ ఫామ్‌తో అదరగొడుతున్నాడు.
శ్రేయస్ కోసం ఇటివల జరిగిన ఐపీఎల్ వేలంలో తీవ్ర పోటీ నెలకొంది. చివరకు కోల్‌కత్తా నైట్ రైడర్స్ అయ్యర్‌ను రూ.12.25 కోట్ల భారీ ధర చెల్లించి సొంతం చేసుకోవడంతో పాటు కెప్టెన్సీ బాధ్యతలను కూడా అప్పగించింది. మరి పాంటింగ్ తనకు చేసిన అవమానానికి ఐపీఎల్‌తోనే కాకుండా ఇలా సూపర్ బ్యాటింగ్‌తో అయ్యర్ బదులు చెప్తున్నాడని క్రికెట్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి అయ్యర్ సూపర్ ఫామ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Man of the Match ✅
Man of the Series ✅How good was @ShreyasIyer15 in this series 👏👏@Paytm #INDvSL pic.twitter.com/654OhvNlTa
— BCCI (@BCCI) February 27, 2022
🚨 Ladies and gentlemen, boys and girls, say hello 👋 to the NEW SKIPPER of the #GalaxyOfKnights
অধিনায়ক #ShreyasIyer @ShreyasIyer15 #IPL2022 #KKR #AmiKKR #Cricket pic.twitter.com/veMfzRoPp2
— KolkataKnightRiders (@KKRiders) February 16, 2022