బెంగుళూరు వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మెగా వేలంలో ఆటగాళ్లు మంచి ధర పలుకుతున్నారు. మొదటి నుంచి అనుకున్నట్లు భారీ డిమాండ్ ఉన్న ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ కోసం ఢిల్లీ, కోల్‌కత్తా పోటీ పడ్డాయి. గతంలో ఢిల్లీకే ఆడిన శ్రేయస్‌ను ఆ ఫ్రాంచైజ్ రిటైన్ చేసుకోలేదు. కానీ వేలంలో మాత్రం అతని కోసం దాదాపు 10 కోట్ల వరకు పోటీ పడింది. కానీ కోల్‌కత్తా నైట్ రైడర్స్ రూ.12.25 కోట్లకు దక్కించుకుంది. దీంతో ఆ జట్టుకు కెప్టెన్సీ సమస్య కూడా తీరినట్లే అయింది. మరి ఈ శ్రేయస్ అయ్యర్‌ను కేకేఆర్ కోనుగోలు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.