టీమిండియా స్టార్ క్రికెటర్, కేకేఆర్ కెప్టెన్ ‘శ్రేయాస్ అయ్యర్’ ఖరీదైన కారును కొనుగోలు చేశాడు. మెర్సీడెస్‌కు చెందిన ఎస్‌యూవీ లగ్జరీ ఏంఎంజీ జి63ని కొనుగోలు చేశాడు. అయ్యర్ కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొత్త కారు కొన్న అయ్యర్ కు అభిమానులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు.
అయ్యర్ కొనుగోలు చేసిన కారు ధర.. రూ. 2.45 కోట్లుగా తెలుస్తోంది. ఈ కారు కేవలం 4.5 సెకన్లలో 100 కిమీ వేగాన్ని అందుకోవడం విశేషం. కాగా అయ్యర్ కారుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన మెర్సిడెస్ సంస్థ.. దానికి ఒక కాప్షన్ కూడా జోడించింది. ”కంగ్రాట్స్ టూ టీమిండియా క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్. మా మెర్సిడెస్ బెంజ్ ఫ్యామిలీలోకి మీకు స్వాగతం. మెర్సిడెస్ బెంజ్‌లో కొత్త మోడల్ కారును కొనుగోలు చేసినందుకు ధన్యవాదాలు. మీ బ్యాటింగ్‌లో కవర్ డ్రైవ్స్ మేము బాగా ఎంజాయ్ చేస్తాం.. ఇప్పుడు మీరు మా కారు డ్రైవింగ్‌ను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం” అంటూ క్యాప్షన్ జత చేసింది.
ఇది కూడా చదవండి: Sourav Ganguly: వీడియో: భార్యతో కలిసి డాన్స్ ఇరగదీసిన గంగూలీ!
ఇక.. ఐపీఎల్ 2022 సీజన్‌లో కేకేఆర్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రేయాస్ అయ్యర్ పూర్తిగా విఫలమయ్యాడు. బ్యాటింగ్‌లోనూ అంతగా రాణించని శ్రేయాస్ అయ్యర్.. కెప్టెన్‌గానూ మెరవలేదు. రెండుసార్లు ఐపీఎల్ చాంపియన్ అయిన కేకేఆర్.. ఈ సీజన్‌లో మాత్రం ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. జూన్ 9 నుంచి ప్రారంభం కానున్న సౌతాఫ్రికా సిరీస్‌కు శ్రేయాస్ అయ్యర్ ఎంపికయ్యాడు.పలువురు సీనియర్లకి విశ్రాంతి ఇవ్వడంతో.. అయ్యర్ జట్టుకు కీలకం కానున్నాడు. ఈ సిరీస్ ద్వారా శ్రేయాస్ తన ఫామ్‌ను తిరిగి అందుకుంటాడని క్రికెట్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి.. అయ్యర్ కొత్త కారుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
KKR skipper Shreyas Iyer buys Mercedes-AMG G 63 4MATIC
Full Details Here 👇#Cricket #ShreyasIyer #MercedesAMG https://t.co/xgQzXRSuit
— SportsTiger (@sportstigerapp) June 2, 2022