టీమిండియాలో గత కొంత కాలంగా కంటిన్యూస్ గా పరుగులు చేస్తున్న బ్యాటర్ ఎవరైనా ఉన్నారా అంటే అది శ్రేయస్ అయ్యర్ అనే చెప్పాలి. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో అద్భుతంగా రాణిస్తూ.. టీమిండియా ఆశాకిరణంగా మారాడు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో ఓ అరుదైన రికార్డ్ నమోదు చేశాడు అయ్యర్. టీమిండియా మిస్టర్ 360 సూర్య కుమార్ యాదవ్ రికార్డ్ ను అయ్యర్ బద్దలు కొట్టాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
శ్రేయస్ అయ్యర్.. భారత జట్టుకు దొరికిన ఓ ఆణిముత్యం అనే చెప్పాలి. ఎందుకంటే ఏ ఫార్మాట్ లో ఎలా ఆడాలో అతడికి బాగా తెలుసు. దానికి నిదర్శనం శ్రేయస్ గణాంకాలే. గత కొన్ని రోజులుగా అయ్యర్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఇటు వన్డేల్లో అయితే శ్రేయస్ ఆట ‘న భూతో న భవిష్యత్’ అనే చెప్పాలి. ఇక బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో48 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమిండియాకు ఆపద్భాంధవుడిలా మారాడు. పుజారాతో కలిసి ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టాడు. వీరిద్దరి భాగస్వామ్యాం కారణంగానే భారత జట్టు తొలి రోజు 6 వికెట్లకు 278 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో అయ్యర్ సూర్య కుమార్ రికార్డ్ ను బ్రేక్ చేశాడు. 21 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఫీట్ సాధించాడు.
ఈ క్రమంలోనే ఒకే క్యాలెండర్ ఇయర్ లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక రన్స్ చేసిన భారత ఆటగాడిగా శ్రేయస్ నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డ్ సూర్య పేరుమీద ఉంది. అతడు 43 ఇన్నింగ్స్ ల్లో1424 పరుగులు చేయగా.. శ్రేయస్ 38 ఇన్నింగ్స్ ల్లోనే 1489 పరుగులు చేసి రికార్డ్ నెలకొల్పాడు. దాంతో ఇప్పటి వరకు SKY పేరుమీద ఉన్న ఈ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. ఇక ఇదే మ్యాచ్ లో పుజారా సైతం ఓ రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. 90 పరుగుల వద్ద అవుట్ అయ్యి సెంచరీ చేజర్చుకున్న పుజారా.. టెస్టుల్లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఎనిమిదవ బ్యాటర్ గా అవరించాడు. ఈ క్రమంలోనే వెంగ్ సర్కార్(6868) ని అధిగమించి ఈ ఘనత సాధించాడు.
Shreyas Iyer dominating 2022 in Indian cricket. pic.twitter.com/Moj657UG4t
— Johns. (@CricCrazyJohns) December 14, 2022