టీమిండియా స్టార్ క్రికెటర్.. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మధ్యలో గాయపడ్డాడు. నొప్పి తిరగబెట్టడంతో అతడిని స్కానింగ్ కు పంపినట్లు తెలుస్తోంది. మరోవైపు చివరిదైన నాలుగో టెస్టు డ్రా దిశగా సాగుతోంది.
భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా చివరిదైన నాలుగో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. తొలి రెండు మ్యాచుల్లో విజయం సాధించిన టీమిండియా.. మూడో దానిలో మాత్రం ఓడిపోయింది. నాలుగో టెస్టు మ్యాచ్ మాత్రం డ్రా దిశగా వెళ్తోంది. నాలుగో రోజు ఆట ఇప్పటికే ప్రారంభమైపోయింది. ఇలాంటి టైంలో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. మ్యాచ్ మధ్యలో స్టార్ ప్లేయర్ గాయపడ్డాడు. అయితే అతడు గ్రౌండ్ లోకి వచ్చేది అనుమానంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ విషయంలో భారత జట్టు ఫ్యాన్స్ మధ్య పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. ఇంతకీ ఏం జరిగింది? ఎవరా క్రికెటర్?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియాతో నిర్ణయాత్మక నాలుగో టెస్టు ఆడుతున్న టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ కు గాయం తిరగబెట్టినట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ టెస్టులో మూడో రోజు ఆడుతూ వెన్నునొప్పితో విలవిల్లాడిపోయినట్లు సమాచారం. దీంతో అయ్యర్ ని బీసీసీఐ మెడికల్ టీమ్ పరీక్షించి స్కానింగ్ కు పంపినట్లు న్యూస్ బయటకొచ్చింది. అయితే వెన్నునొప్పి కారణంగానే ఈ సిరీస్ లోని తొలి టెస్టుకు అయ్యర్ దూరమయ్యాడు. దీంతో అతడి బదులు సూర్యకుమార్ యాదవ్ ని ఎంపిక చేశారు. రెండో టెస్టులోకి అందుబాటులోకి వచ్చేసిన శ్రేయస్.. దిల్లీ టెస్టులో 16, మూడో టెస్టులో 26 పరుగులు మాత్రమే చేశాడు. ఇక చివరి టెస్టులోనైనా రాణిస్తాడనుకుంటే.. వెన్నునొప్పి కారణంగా మ్యాచుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది.
ఇదిలా ఉండగా.. అహ్మదాబాద్ టెస్టులో భారత కచ్చితంగా గెలిచి తీరాలి. అప్పుడే టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. లేదంటే న్యూజిలాండ్-శ్రీలంక టెస్టు సిరీస్ ఫలితం వచ్చేవరకు ఎదురుచూడాల్సి ఉంటుంది. నాలుగో టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. తొలి ఇన్నింగ్స్ లో 480 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ నాలుగో రోజు ఆటని 289/3 స్కోరుతో ఆట ప్రారంభించింది. లంచ్ సమయానికి 362/4తో నిలిచింది. క్రీజులో కోహ్లీ(88 నాటౌట్), కేఎస్ భరత్ (25 నాటౌట్) ఉన్నారు. ఇంకా భారత జట్టు 118 పరుగులు వెనకబడి ఉంది. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే.. ఈ మ్యాచ్ డ్రా కావడం దాదాపు కన్ఫర్మ్ అని తెలుస్తోంది. ఏదైతేనేం అయ్యర్ గాయపడటంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
Shreyas Iyer!#INDvAUS pic.twitter.com/ulosY2YVr6
— RVCJ Media (@RVCJ_FB) March 12, 2023