టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐ చెప్పిన దానికి వ్యతిరేకంగా వెళ్లేందుకు రెడీ అయిపోయాడు. ఐపీఎల్ విషయంలో తన మాటే చెల్లాలని మంకుపట్టు పట్టి కూర్చున్నాడట. ఇది కాస్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
టీమిండియా క్రికెటర్లు బీసీసీఐ చెప్పిందే వింటూ వస్తున్నారు. చాలా ఏళ్ల నుంచి దాదాపుగా జరుగుతున్నది ఇదే. ఒకవేళ ఎవరైనా ఆటగాడు.. భారత క్రికెట్ బోర్డు చెప్పింది వినకపోతే వాళ్లకు సరిగా అవకాశాలు ఇవ్వకపోవడమో లాంటివి చేసి కెరీర్ పూర్తిగా డౌన్ అయ్యేలా చేస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ అలానే చేస్తున్నాడనే టాక్ వినిపిస్తుంది. గాయంతో బాధపడుతున్న అయ్యర్ కు బోర్డ్ ఓ సలహా ఇచ్చింది. మనోడు మాత్రం తూచ్.. దాన్ని అస్సలు ఫాలో కానని చెప్పేశాడట. ప్రస్తుతం ఈ విషయం కాస్త క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రపంచంలోని ప్రతి క్రికెటర్ ఆడాలనుకునే లీగ్ ఐపీఎల్. ఏ క్షణాన దీన్ని స్టార్ట్ చేశారో గానీ అటు బీసీసీఐతో పాటు ఆటగాళ్లకు కోట్లకు కోట్లకు డబ్బు రావడం స్టార్టయింది. ఈ క్రమంలోనే దేశం తరఫున ఆడినా ఆడకపోయినా.. ఈ టోర్నీలో ఆడాలని ఆటగాళ్లు గట్టిగా ఫిక్సవుతుంటారు. గాయంతో ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు, వన్డే సిరీస్ కు దూరమైన శ్రేయస్ అయ్యర్.. ఐపీఎల్ ప్రారంభ మ్యాచులకు కూడా దూరమవుతాడని చాలామంది అనుకున్నారు. కానీ మనోడు మాత్రం ఆడేస్తానని అంటున్నాడట.
ప్రస్తుతం వెన్నెముక గాయంతో బాధపడుతున్న అయ్యర్ ని సర్జరీ చేసుకోమని.. బీసీసీఐ, జాతీయ క్రికెట్ అకాడమీ సూచించాయి. కానీ శ్రేయస్ మాత్రం దానికి నో చెప్పాడట. ఒకవేళ ఆపరేషన్ చేయించుకుంటే.. దాదాపు 7 నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందని, ఇదే జరిగితే ఐపీఎల్ తోపాటు స్వదేశంలో జరగబోయే వన్డే వరల్డ్ కప్ మిస్ అయ్యే ఛాన్స్ ఉందని భయపడుతున్నాడు. అందుకే మందులు, ఆయుర్వేద మెడిసన్ తీసుకుని అయినా సరే ఐపీఎల్ ఆడాలని ఫిక్స్ అయ్యాడట. ఇలా ఫామ్ నిరూపించుకుంటే.. ప్రపంచకప్ జట్టులో చోటు దక్కుతుందని భావిస్తున్నాడు.
అదే టైంలో శ్రేయస్.. ఈసారి ఐపీఎల్ కు పూర్తిగా దూరం కానున్నాడనే టాక్ కూడా వినిపిస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు పెద్ద దెబ్బ తగలడం గ్యారంటీ. ఎందుకంటే కెప్టెన్ కమ్ బ్యాటర్ గా అయ్యర్ అద్భుతంగా ఆడతాడు. ఒకవేళ ఇతడు తప్పుకుంటే జట్టులో సీనియర్ అయిన నరైన్ కు కెప్టెన్సీ ఇవ్వొచ్చు. కానీ సారథిగా అతడికి పెద్ద సక్సెస్ లేదు. ఒకవేళ నరైన్ కాకపోతే నితీశ్ రానా, టీమ్ సౌథీలలో ఎవరైనా కెప్టెన్ అయ్యే అవకాశముంటుంది. సరే ఇదంతా పక్కనబెడితే.. శ్రేయస్ బీసీసీఐతో దాదాపు గొడవకు రెడీ అయిపోయాడంటూ వస్తున్న వార్తలపై మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.