శ్రీలంక స్టార్ క్రికెటర్ కుశాల్ పెరీరా ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అతని ఏమైదంటూ క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. కుశాల్ పెరీరా భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కొన్ని రోజుల క్రితం భుజం గాయంతో జాతీయ జట్టుకు దూరమైన కుశాల్ పెరీరా ఇంగ్లండ్‌లో తన భుజానికి సర్జరీ చేయించుకున్నాడు. శస్త్రచికిత్స అనంతరం పెరీరా ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా.. పెరీర్ త్వరగా కోలుకోవాలని శ్రీలంక క్రికెటర్లతో పాటు క్రికెట్ అభిమానులు సైతం సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
కాగా.. ప్రస్తుతం శ్రీలంక ఆసియా కప్‌లో సూపర్ ఫోర్‌కు చేరింది. బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించింది. కాగా.. కుశాల్ పెరీరాకు గాయం కాకుంటే ప్రస్తుతం ఆసియా కప్‌లో ఉన్న శ్రీలంక జట్టులో ఉండేవాడు. ఇప్పటి వరకు 22 టెస్టులు ఆడిన కుశాల్ 1177 పరుగులు చేశాడు. అందులో 2 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 107 వన్డేల్లో 3071 పరుగులు సాధించాడు. అందులో 6 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇక శ్రీలంక తరఫున 60 టీ20లు ఆడిన పెరీరా 1539 పరుగులు చేశాడు. అందులో 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. శ్రీలంక క్రికెట్‌లో మరో జయసూర్యలా పెరీరా పేరు తెచ్చుకున్నాడు. భుజం గాయం నుంచి కోలుకున్న తర్వాత పెరీరా తిరిగి జట్టుతో చేరనున్నాడు. మరి పెరీరా శస్త్రచికిత్సపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Kusal Perera completed a successful shoulder surgery. Can’t wait to see him back again on the field.
.
.
.
.
.#KusalPerera #SriLanka #Cricket #Recovery #CricTracker pic.twitter.com/MFZhww2g4R— PAK CRickeT ELeveN (@Murshadbasit) September 2, 2022
Players with 35+ average & 140+ S/R in T20s vs Asian Teams (min 500 runs)
🇳🇿 Colin Munro
🇦🇺 David Warner
🇿🇦 David Miller
🏴 Kevin Pietersen
🇱🇰 Kusal Perera ***KJP is the only Asian player in this list & Sri Lanka will have to play without him in #AsiaCup2022. Feeling sad 😓💔 pic.twitter.com/N3l415hP09
— Thurunu Jayasiri (@ThurunuJ) August 24, 2022
#SriLanka‘s wicketkeeper-batter #KusalPerera has reportedly undergone a shoulder surgery in the UK, which will further delay his comeback to the side and has virtually ruled him out of the ICC #T20WorldCup in #Australia in October-November this year.
Photo: @Angelo69Mathews pic.twitter.com/d76iWbaGtO
— IANS (@ians_india) September 2, 2022