28 బంతుల్లోనే 49 పరుగులు చేసి ఇంకో ఓవర్ మిగిలి ఉన్నా.. కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోలేకపోవడంపై అతని ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. కానీ.. టీమిండియా కోసం దినేష్ కార్తీక్ నుంచి స్ట్రైక్ తీసుకోకుండా.. కోహ్లీ నిస్వార్థం చూపించాడంటూ సోషల్ మీడియాలో విషయం వైరల్ అవుతోంది. డీకే సైతం సింగిల్ తీసి ఇస్తా స్ట్రైక్ తీసుకోమని కోరినా.. కోహ్లీ ఎంతో హుందాగా దాన్ని తిరస్కరించి, సెల్ఫ్ లెస్ గేమ్‌ను చూపించి తన ఫిఫ్టీని లెక్క చేయలేదంటూ క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. కానీ.. అసలు నిజం ఏమిటంటే కోహ్లీ చేసిన ఒక తప్పే అతన్ని హాఫ్ సెంచరీకి దూరం చేసింది. అవును నిజం. సింగిల్స్, డబుల్స్ కోసం చిరుతలా పరిగెత్తే కోహ్లీ.. ఆదివారం సౌతాఫ్రికాతో మ్యాచ్‌లోనే అదే వేగం చూపించాడు. కానీ.. అదే వేగంలో ఒక తప్పు చేశాడు.
సౌతాఫ్రికా బౌలర్ పార్నెల్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్ ఐదో బంతిని స్వ్కైర్‌లెగ్ వైపు ఫ్లిక్ షాట్ ఆడిన కోహ్లీ.. అత్యంత వేగంగా రెండు పరుగులు తీసుకున్నాడు. అతని పార్టనర్ సూర్యకుమార్ యాదవ్ సైతం ఆ డబుల్స్‌కు వేగంగా పరిగెత్తాడు. ఇద్దరూ సక్సెస్ ఫుల్‌గా రెండు పరుగులు పూర్తిచేశారు. కానీ.. అంపైర్ మాత్రం ఒక్క పరుగే ఇచ్చాడు. అందుకు కారణం.. కోహ్లీ మొదటి రన్‌కు వెళ్లి నాన్‌స్ట్రైకర్ ఎండ్ వైపు బ్యాట్‌ను క్రీజ్ లోపల పెట్ట లేదు. ఇక ఇంచు గ్యాప్‌తో కేవలం లైన్‌ను బ్యాట్‌తో తాకి వచ్చేశాడు. దీంతో దాన్ని షార్ట్ రన్‌గా నిర్ధారించిన అంపైర్ రెండు రన్స్ రావాల్సిన చోట ఒక్కటే రన్ ఇచ్చాడు. వికెట్ల మధ్య పరుగులను ఎప్పుడూ మిస్ కానీ కోహ్లీ.. తొలి సారి షార్ట్ రన్‌తో తన శ్రమకు ఫలితం లేకుండా చేశాడు.
ఈ షార్ట్ రన్‌తో టీమిండియా ఒక రన్‌ను కోల్పోవడంతో పాటు విరాట్ కోహ్లీ తీవ్ర నష్టం చేసింది. 49 వద్ద నాటౌట్‌గా మిగిలిపోయిన కోహ్లీ తన హాఫ్ సెంచరీని పూర్తి చేయలేకపోయాడు. ఆ షార్ట్ రన్ లేకుండా ఉంటే కోహ్లీ 50 రన్స్ పూర్తి చేసుకునేవాడు. కానీ.. దురదృష్టం కొద్ది ఒక ఇంచు తేడాతో కోహ్లీ తన హాఫ్ సెంచరీని మిస్ అయ్యాడు. కానీ.. చివరి ఓవర్‌లో కోహ్లీ స్ట్రైక్ తీసుకోకపోవడం, దినేష్ కార్తీక్ స్ట్రైక్ ఇస్తానన్న వదనంతోపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. కేవలం ఫిఫ్టీ కోసమే సింగిల్ తీసుకోకుండా ఉండటం గొప్ప విషయమే అయినప్పటికీ.. కోహ్లీ చేసిన తప్పే.. అతన్ని హాఫ్ సెంచరీకి దూరం చేసిందనేది మాత్రం వాస్తవం.
Cricket is a game of margins they said, very well said. In the end, this short run costed Virat Kohli’s fifty. Anyways this 49 with an sr of 175 was dooppp🤤🔥 pic.twitter.com/EBSIYalDgp
— Akshat (@AkshatOM10) October 2, 2022
In the end that short run costed Kohli the 50.
Dk isn’t the one to be blamed pic.twitter.com/gFr0FflUBh— Sibhi_virat (@SibhiSundar) October 2, 2022
ఇది కూడా చదవండి: సూర్యకుమార్ యాదవ్‌కు తీవ్ర అన్యాయం! మండిపడుతున్న ఫ్యాన్స్