ఒత్తిడిని తట్టుకోలేక జాతీయ స్థాయి షూటర్ కొనికా లాయక్ (26) ఆత్మహత్య చేసుకుంది. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చెందిన కొనికా.. కోల్‌కతాలోని ఓ హాస్టల్‌లో ఉంటూ రైఫిల్ శిక్షణ కొనసాగిస్తున్నది. బుధవారం తన గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. షూటింగ్‌లో రాణించలేకపోతున్నా.. అందుకే ఆత్మహత్య చేసుకున్నట్లు ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభ్యమైందని పోలీసులు తెలిపారు.
గతంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సోనూసూద్.. రైఫిల్ గిఫ్ట్ ఇవ్వడంతో షూటర్ కొనికా బయట ప్రపంచానికి తెలిసింది. కొనికా మరణంపై సోనూ సూద్ విచారం వ్యక్తం చేశాడు. ఆమె మరణం తానొక్కడినే కాదని, దేశాన్ని మొత్తం శోకసంద్రంలో నింపిందని సోనూసూద్ ఆవేదన వ్యక్తం చేశాడు. జాతీయ స్థాయి పోటీలకు సిద్ధపడుతున్న ఆమె సూసైడ్ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే గడిచిన నాలుగు నెలల్లో నలుగురు యువ షూటర్స్ ఆత్మహత్య చేసుకోవడం ఆందోళనకి గురి చేస్తోంది. గతంలో ఖుషీరత్ కౌర్ సంధు, హునర్ దీప్ సింగ్, నమన్ వీర్ సింగ్ ఆత్మహత్యకు చేసుకున్నారు. వరుసగా ఇలాంటి యువ షూటర్ ఆత్మహత్యలు అందరిని బాధిస్తోంది. క్రీడా రంగంలో ఎంతో భవిష్యత్ ఉన్న ఈ యువ షూటర్ ఆత్మహత్య పాల్పడి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించింది. ఈ సంఘటన పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: మొహమాటం వదిలేసిన షణ్ముఖ్.. నువ్వు నాకు పడిపోయావే అంటూ
आज सिर्फ मेरा नहीं,
सिर्फ धनबाद का नहीं,
पूरे देश का दिल टूटा है। 💔 https://t.co/gD3Qb7UAel— sonu sood (@SonuSood) December 16, 2021