టీమిండియా క్రికెటర్ రాబిన్ ఉతప్ప.. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. పలువురు మాజీలు అతడిని అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. అభిమానులు కూడా ఓ మంచి క్రికెటర్ ని ఇకపై మైదానంలో చూడలేమని బాధపడుతున్నారు. అతడి బ్యాటింగ్ రికార్డులు గురించి ఓవైపు మాట్లాడుతున్నారు. ఇలాంటి ఈ టైమ్ లో ఉతప్ప జీవితంలో జరిగిన ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అదే ఒకానొక సమయంలో ఉతప్ప సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాడట. ఇప్పుడు ఇది అభిమానుల మధ్య చర్చకు కారణమైంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియా జట్టులో ఉతప్ప ఓ సభ్యుడు. ఆ తర్వాత భారత జట్టు తరఫున కొన్ని మ్యాచులు ఆడాడు. మొత్తంగా 46 వన్డేల్లో 934 పరుగులు,13 టీ20ల్లో 249 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్ లోనూ కోల్ కతా నైట్ రైడర్స్ తరఫున ఆడాడు. 2012, 2014లో రెండుసార్లు కప్పు కొట్టిన జట్టులో ఉన్నాడు. గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడి మూడోసారి కప్పును ముద్దాడాడు. ఓపెనర్ గా, మిడిలార్డర్ బ్యాటర్ గా ఎన్నో మంచి మంచి ఇన్నింగ్స్ లు ఆడిన ఉతప్పు.. 2009 ఆ సమయంలో సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాడు. గతంలో ఓసారి స్వయంగా ఉతప్పనే ఈ విషయం బయటపెట్టాడు.
‘2009-11 మధ్య మానసికంగా దారుణమైన స్థితి అనుభవించాను. నా ఆలోచనలన్నీ ఆత్మహత్య చుట్టూ తిరుగుతుండేవి. బాల్కానీ నుంచి దూకేయాలని అనిపించేది. కానీ ఏదో అదృశ్యశక్తి ఆపేది’ అని ఉతప్ప చెప్పాడు. టీమిండియాలో చోటు దక్కని దశలో ఇదంతా జరిగిందని అన్నాడు. ఇతరుల సహాయంతో డిప్రెషన్ నుంచి బయటపడ్డానని చెప్పాడు. ఇక కుటుంబంతో గడిపేందుకు వీడ్కోలు పలికానని ఉతప్ప చెబుతున్నప్పటికీ.. వేరే దేశాల లీగ్స్ లో ఆడేందుకు ఈ రిటైర్మెంట్ తీసుకున్నాడనే టాక్. ఒకవేళ ఆటగాడిగా కాకపోయినా కోచ్, మెంటార్ గా అయినా సరే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టే ఛాన్సులు కనిపిస్తున్నాయి. మరి అప్పట్లో ఉతప్ప, సూసైడ్ ఆలోచనల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: పదేళ్లకే మూర్చ వ్యాధి.. స్టెరాయిడ్స్ తో అధిక బరువు.. ఉతప్ప ప్రస్థానం!