పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఈ మధ్య కాలంలో వార్తల్లో బాగా కనిపిస్తున్నాడు. దానికి కారణం అతడి భార్య సానియా మీర్జా. వీళ్లిద్దరూ కొంతకాలం నుంచి దూరందూరంగా ఉంటున్నారని, అఫీషియల్ గా విడాకులు కూడా తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారానికి కారణం పాక్ కి చెందిన ఓ మోడల్ అని కూడా మాట్లాడుకుంటున్నారు. ఆమెతో క్లోజ్ గా మూవ్ అయి చేసిన ఓ ఫొటో షూట్.. ఈ మొత్తం వ్యవహారానికి కారణమని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇదంతా కూడా సోషల్ మీడియాలో, న్యూస్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి టైంలో ఓ టీవీ లైవ్ లో మాట్లాడుతూ మాలిక్ కన్నీళ్లు పెట్టుకోవడం చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుత టీ20 వరల్డ్ కప్ లోని సూపర్-12 దశలో అంతంత మాత్రంగా ఆడిన పాకిస్థాన్, అనుహ్యంగా సెమీస్ లో అడుగుపెట్టింది. అక్కడ న్యూజిలాండ్ పై గెలిచి, ఫైనల్ కి చేరిపోయింది. కప్ కోసం ఇంగ్లాండ్ తో తాడోపేడో తేల్చుకోనుంది. అయితే పాక్ చివరగా 2009లో టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది. ఇప్పుడు అదే విషయామై పాక్ టీవీ ఛానెల్లో డిస్కషన్ పెట్టారు. ఈ ఈవెంట్ కి మిస్బా ఉల్ హక్ తోపాటు షోయబ్ మాలిక్ గెస్టులుగా హాజరయ్యారు. అప్పటి విషయాల్ని గుర్తుచేసుకున్నారు. ‘2009లో మా జట్టు కప్ గెలిచినప్పుడు.. కెప్టెన్ యూనిస్ ఖాన్ నన్ను పిలిచారు. ట్రోఫీ పట్టుకోమని నాకు చెప్పారు. అది నాకు చాలా స్పెషల్ మూమెంట్’ అని షోయబ్ ఎమోషనల్ అయ్యాడు. లైవ్ లోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
లార్డ్స్ మైదానంలో జరిగిన ఆ ఫైనల్లో పాక్-శ్రీలంక జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన లంక.. నిర్ణీత ఓవర్లలో 139 పరుగులు చేసింది. అనంతరంలో ఛేదనలో పాక్ నిలబడింది. 18.4 ఓవర్లలో టార్గెట్ ఫినిష్ చేశారు. ఆ రోజు 40 బంతుల్లో 54 పరుగులు చేసిన షాహిద్ అఫ్రిది.. స్టార్ ఆఫ్ ది నైట్ గా నిలిచాడు. మరో ఎండ్ లోని షోయబ్ మాలిక్ 22 బంతుల్లో 24 పరుగులే చేసినప్పటికీ స్టాండింగ్ ఇచ్చాడు. దీంతో మ్యాచ్ పాక్ గెలిచింది. ఈ టోర్నీలో తొలిసారి కప్ అందుకుంది. మరి ఈసారి ఏం జరుగుతుందనేది చూడాలి. ఎందుకంటే అద్భుతంగా ఆడుతున్న ఇంగ్లాండ్ జట్టుని పాక్ నిలువరిస్తుందా? చేతులెత్తేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. మరి మాలిక్ కన్నీళ్లు పెట్టుకోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.