రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ ఎప్పుడు ఏదో ఒక కామెంట్ చేస్తూ.. వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పుడు పాక్ కెప్టెన్ బాబర్ అజమ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ ప్రస్తుతం ఉన్న వరల్డ్ టాప్ క్లాస్ క్రికెటర్లలో ఒకడు. ఒక ఆటగాడిగా టాలెంట్‌కు కొదవలేదు. అలాంటి క్రికెటర్ పరువు తీసేలా ఆ దేశానికే చెందిన మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కామెంట్ చేశారు.ఇంగ్లీష్ భాష రాకనే బాబర్ వ్యాపార ప్రకటనలను దక్కించుకోలేకపోతున్నాడని, ఏ ప్రొడెక్ట్‌కు కూడా బ్రాండ్ అంబాసిడర్ కాలేకపోయాడని అక్తర్ పేర్కొన్నాడు. ప్రస్తుత పాకిస్థాన్ టీమ్‌లో ఇంగ్లీష్‌ను అనర్గళంగా మాట్లాడే వారు ఒక్కరు కూడా లేరని అన్నాడు.
ఇంగ్లీష్ రాకపోకవడంతో చాలా మంది క్రికెటర్లు మ్యాచ్ తర్వాత ప్రజెంటేషన్ సెర్మనీలో అలాగే మీడియా మాట్లాడేందుకు భయపడతారని తెలిపాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆట ఆడటంతో పాటు కమ్యూనికేట్ చేయడం కూడా అవసరమని పేర్కొన్నాడు. పాకిస్థాన్‌లో ఇంగ్లీష్‌ను తడబడకుండా మాట్లడగల క్రికెటర్లలో తాను, షాహిద్ అఫ్రిదీ, వసీం అక్రమ్ మాత్రమే ఉన్నట్లు తెలిపాడు. అందుకే తమ ముగ్గురికే ఎక్కువగా వ్యాపార, వాణిజ్య ప్రకటనలు వస్తాయని, అయినా క్రికెట్‌లో రాణించడం ఒక ఎత్తు అయితే మీడియాతో కమ్యూనికేట్ చేయడం మరో ఎత్తు అని అక్తర్ తెలిపారు.
ప్రస్తుతం పాకిస్థాన్ జట్టులో ఎవరూ కూడా ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేరు అంటూ కొంతతక్కువ చేసి మాట్లాడారు అక్తర్. బాబర్ అజమ్ తన ఆట గురించి కూడా ఇంగ్లీష్‌లో వివరించలేడని అన్నాడు. బాబర్ ఇంగ్లీష్ చక్కగా మాట్లాడితే పాకిస్థాన్‌లో అతనే నంబర్ వన్ బ్రాండ్ అంబాసిడర్ అవుతాడని పేర్కొన్నాడు. బాబర్‌కు తాను చాలా సార్లు ఇంగ్లీష్ ప్రాముఖ్యత గురించి విమరించి, నేర్చుకోవాలని సూచించనట్లు తెలిపాడు. కానీ.. బాబర్ తన మాటలను పట్టించుకోలేదని సైతం వెల్లడించాడు. కాగా.. అక్తర్ వ్యాఖ్యలపై పాక్ క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. పాకిస్థాన్ క్రికెటర్లకు ఇంగ్లీష్ రాదని హేళన చేస్తూ మాట్లాడినట్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Shoaib Akhtar on Babar Azam pic.twitter.com/LHkkiV9UNn
— RVCJ Media (@RVCJ_FB) February 21, 2023