పాక్ మాజీ క్రికెటర్, రావాల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ మరోసారి హాట్ కామెంట్స్ చేశాడు. టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటాం అంటూ భారీ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఏ విషయంలో రివేంజ్ తీర్చుకుంటానన్నాడో మీరూ తెలుసుకోండి..
సందర్భం ఏదైనా పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు ఇండియా గురించో, ఇండియన్ క్రికెటర్ల గురించో ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అది వారి అలవాటు. అలాంటి మాజీ క్రికెటర్లలో షోయబ్ అక్తర్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాడు. ఏదో ఒకటి అనకుంటే అతనికి నిద్ర పట్టదేమో అన్నట్లు ఉంటాయి అతని వ్యాఖ్యలు. తాజాగా భారత్‌పై రివేంజ్ తీర్చుకుంటాం అంటూ భారీ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. 2011 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా, పాకిస్థాన్‌ను సెమీ ఫైనల్‌లో 29 పరుగుల తేడాతో ఓడించి.. ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి.. ప్రపంచ ఛాంపియన్‌గా భారత జట్టు నిలిచింది. ఆ వరల్డ్ కప్ సెమీస్‌లో ఎదురైన ఓటమికి ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రారంభం కానున్న వన్డే వరల్డ్ కప్‌లో బదులు తీర్చుకుంటామని అక్తర్ అంటున్నాడు.
వన్డే వరల్డ్ కప్ ఆరంభానికి ఆరు నెలల ముందే అక్తర్ ఇలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వడంపై క్రికెట్ అభిమానులు నవ్వుకుంటున్నారు. కాగా, వన్డే వరల్డ్ కప్ 2023 భారత్‌లో జరగనున్న విషయం తెలిసిందే. 2011 వరల్డ్ కప్ సైతం ఇండియాలోనే జరిగింది. దీంతో మళ్లీ అలాంటి అపూర్వ విజయం టీమిండియా సాధిస్తుందని క్రికెట్ అభిమానులు బలంగా నమ్ముతున్నారు. కాగా, ఆ వరల్డ్ కప్‌లో సెమీస్‌లో ఎదురైన ఓటమికి ఈ వరల్డ్ కప్ ఫైనల్లో రివేంజ్ తీర్చుకుంటామని అక్తర్ అంటున్నాడు. ఈ ఏడాది వరల్డ్ కప్‌లో భారత్-పాకిస్థాన్ ఫైనల్ ఆడాలని కోరుకుంటున్నట్లు అక్తర్ పేర్కొన్నాడు.
వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ అహ్మాదాబాద్‌లో జరిగినా, ముంబైలో జరిగినా ఎక్కడ జరిగినా.. భారత్-పాకిస్థాన్ ఫైనల్ ఆడాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. అలాగే, ఆసియా కప్ 2023 గురించి భారత్, పాక్ బోర్డుల మధ్య జరుగుతున్న రచ్చ గురించి కూడా స్పందించిన అక్తర్, ఈ విషయంలో మాజీ క్రికెటర్లు మాట్లాడకపోవడమే ఉత్తమం అని అన్నాడు. ఇరు దేశాల ప్రభుత్వాలు ఎలా చెబితే అలా బోర్డులు నడుచుకుంటాయని, భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు టీమిండియాను పంపేందుకు ఓకే చెబితే.. బీసీసీఐకి ఎలాంటి అభ్యంతరం ఉండదని, అలాగే పీసీబీ విషయంలో కూడా అంతే అని అక్తర్ అన్నాడు. కాగా ఆసియా కప్ 2023కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. టీమిండియా పాక్ వెళ్లదని బీసీసీఐ ఇప్పటికే తెగేసి చెప్పింది. మరి ఆసియా కప్ విషయంలో, వరల్డ్ కప్‌లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ విషయంలో అక్తర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
“I wish to work with the Pakistan team in the 2023 World Cup in India. I wish we lift the World Cup at the Wankhede in Mumbai and sing our national anthem. I want to close the chapter of Mohali in 2011 on a winning note, that’s the only thing missing in life,” Shoaib Akhtar.
— Farid Khan (@_FaridKhan) January 4, 2023