దాదాపు 20 ఏళ్ల పాటు ప్రపంచ క్రికెటన్‌ను ఏలిన దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్. అతని కాలంతో ప్రపంచ అత్యుత్తమ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. మ్యాచ్‌కు ముందు నిద్రలేకుండా చేశాడు. ఇలా సచిన్ బారిన పడిన బౌలర్లలో పాకిస్థాన్ పేసర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ కూడా ఒకడు. కానీ.. అక్తర్ పాకిస్థాన్ జట్టులోకి అడుగుపెట్టిన సమయానికే సచిన్ ప్రపంచ క్రికెట్‌లో టాప్ బ్యాటర్‌గా పరుగుల వరద పారిస్తున్నాడు.
కానీ ఆ విషయం అప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టన అక్తర్‌కు మాత్రం సచిన్ ఎవరో తెలియదట. తన సహచర ఆటగాడు సక్లైన్ ముస్తాక్ వివరించిన తర్వాత ప్రపంచ క్రికెట్‌లో సచిన్ స్థాయి ఏంటో తనకు అర్థమైందని తాజాగా అక్తర్ పేర్కొన్నాడు. ఆ సమయంలో నా దృష్టి మొత్తం బంతిని ఎంత వీలైతే అంత వేగంగా వేద్దాం.. ప్రత్యర్థిని తన స్పీడ్‌తో ఎలా ఇబ్బంది పెట్టాలి, మ్యాచ్‌ను ఎలా గెలిపించాలనే దానిపైనే ఉండేదని. అందుకే ప్రత్యర్థి జట్టులో ఎవరున్నారు? వారు ఎలాంటి ఆటగాళ్లు అనే విషయాలు తాను ఆలోచించి వాడిని కాదని అక్తర్ వెల్లడించాడు.
కానీ.. ఆ తర్వా త సచిన్ టెండ్కూలర్ గురించి తెలుసుకోవడం, అతని ఆట చూసిన తర్వాత సచిన్ స్థాయి ఏంటో తనకు బోధపడిందని అక్తర్ పేర్కొన్నాడు. అంతర్జాతీయ వేదికగా భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో సచిన్ వర్సెస్ అక్తర్‌గా అనేక మ్యాచ్‌లు జరిగాయి. కొన్ని మ్యాచ్‌ల్లో సచిన్ పైచేయి సాధిస్తే.. కొన్ని సార్లు సచిన్‌ను త్వరగా అవుట్ చేసి అక్తర్ పైచేయి సాధించేవాడు. అప్పటికే విపరీతమైన క్రీజ్ ఉన్న భారత్-పాక్ మ్యాచ్‌కు సచిన్ వర్సెస్ అక్తర్ రైవలరీ మరింత హైప్‌ను తీసుకొచ్చింది. మరి సచిన్ స్థాయి గురించి అక్తర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Shoaib Akhtar says Did not know about Sachin Tendulkar It was Saqlain Mushtaq who told me about his stature – शोएब अख्तर का खुलासा https://t.co/S2q3dDqxNG
— DTN (पैनी नजर, बेबाक खबर) (@DTNmedia) August 15, 2022